- Advertisement -

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవాల‌నె చిత్త శుద్ధి ఉంటె చాలు

- Advertisement -

అధికారంలోకి రావ‌డానికి ఇప్పుడు ఉన్న ఏకైక అస్త్రం పాద‌యాత్ర‌. ఎంతో మంది నాయ‌కులు పాద‌యాత్ర‌ల ద్వారా అధికారంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వారంద‌రు కూడా పాద‌యాత్ర చేస్తున్న‌ప్పుడు ఇలాంటి డ్ర‌స్ వేసుకోవాల‌ని అనుకోలేదు. ప్ర‌జా స‌మ‌స్య‌లే ప‌ర‌మావ‌ధిగా పాద‌యాత్ర చేప‌ట్టి అధికారంలోకి వ‌చ్చారు.

ప్ర‌జ‌ల‌కు పాద‌యాత్రలు కొత్త‌కాదు..ఉమ్మ‌డి ఏపీలో అప్ప‌టి కాంగ్రెస్ నేత‌, దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్రారంభించిన పాద‌యాత్ర సంచ‌ల‌న రికార్డు న‌మోదు చేసింది. రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చేందుకు ధికారంలోకి వ‌చ్చేందుకు ఈ పాద‌యాత్రే కార‌ణ‌మైంది. ఆ త‌ర్వాత ఓట్ల రూపంలో వైఎస్‌కి ల‌బ్ధి చేకూర్చాయి.

ప్ర‌జ‌లు ఎక్కువ‌గా వైఎస్‌తో క‌నెక్ట్ అయ్యేందుకు దోహ‌ద‌ప‌డిన ప్ర‌ధాన అంశం పంచె క‌ట్టు. తెల్లగా ధ‌గ‌ధ‌గ‌లాడుతూ మెరిసే.. పంచె క‌ట్టు ఆర‌డుగుల భారీ కాయం… ముఖంపై చెద‌ర‌ని చిరున‌వ్వు.. క‌లిసి క‌ట్టుగా మూట‌గ‌ట్టిన‌ట్టు వైఎస్ జ‌నాల‌కు ఇట్టే క‌నెక్ట్ అయ్యారు. దీంతో గ్రామాలు, ప‌ల్లెల్లో కాంగ్రెస్ ఊపు మ‌రింత పెరిగింది. వాస్త‌వానికి వైఎస్ ఎప్పుడో కానీ ఫ్యాంట్ ధ‌రించేవారు కాదు. ఎక్క‌డి కెల్లినా వైఎస్ఆర్ పంచ‌క‌ట్టులోనె వెల్లేవారు. పంచ‌క‌ట్టుకు ఐకాన్ వైఎస్ఆర్‌.

జ‌నాల‌కు ఆయ‌న‌ను చేరువ చేసిన పంచె క‌ట్టు..విష‌యంలో ఇప్పుడు వైసీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ నడుస్తోంది. న‌వంబ‌రు 2 నుంచి వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. పాద‌యాత్ర ప్రారంభిస్తున్నారు. ప‌ట్ట‌ణాల్లో వైసీపీకి బ‌లం బాగానే ఉన్నా.. ప‌ల్లెలు, గ్రామాల్లో మాత్రం ఆసించిన మేర‌కు బ‌లం లేదు. దీంతో ప‌ల్లె జ‌నాల‌ను ఆక‌ర్షించేందుకు త‌న తండ్రి మాదిరిగా జ‌గ‌న్ కూడా పంచె ధ‌రిస్తే.. బాగుంటుంద‌ని ఇటీవ‌ల వైసీపీ నేత‌లు జ‌గ‌న్ కు సూచించారు.

మొద‌ట మౌనంగానె ఉన్నా ప్ర‌స్తుతం ఇప్పుడు దానిపై దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. అస‌లు పాద‌యాత్ర చేయ‌డానికి ఎక్క‌డైనా డ్ర‌స్ కోడ్ ఉందా. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లను , క‌ష్టాల‌ను తెలుసుకోవాలంటె పంచ‌క‌ట్టే అవ‌స‌రం లేదు…చిత్త‌శుద్ధి ఉంటె చాలు. పంచ క‌ట్టుకు ఐకాన్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. వైఎస్ఆర్ వ‌య‌సుకు, ఆయ‌న ఆహ‌బావాల‌ను పంచ‌క‌ట్టుఅనేది ఆయ‌న‌కు హుందాత‌నాన్ని తెచ్చిపెడుతుంది. జ‌గ‌న్ కూడా ఆయ‌న‌లాగె అనుస‌రించి అధికారంలోకి రావాల‌నుకోవ‌డం త‌ప్పులేదు. పాద‌యాత్ర‌కు కూడా డ్ర‌స్ కోడ్ పాటించ‌డం అంటె హాస్యాస్ప‌ద‌మే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -