Saturday, May 3, 2025
- Advertisement -

విశాఖలో కూటమికి భంగపాటేనా?

- Advertisement -

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పార్టీ ఫిరాయింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాటలోనే పలు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది టీడీపీ. అయితే విశాఖ కార్పొరేషన్‌కు దక్కించుకోవాలని చూస్తున్న తెలుగుదేశంకు భంగపాటే ఎదురవుతోంది.

2021లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 98 కార్పోరేటర్లకు గానూ వైసీపీ 59 స్థానాలను కైవసం చేసుకుంది. వైసీపీ తరఫున గొలగాని హరి వెంకట కుమారి మేయర్‌గా ఎన్నికయ్యారు. ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కార్పోరేటర్ల ఫిరాయింపులు చేస్తూ వస్తోంది.

ఇప్పటికి ఆరుగురు వైసీపీ కార్పోరేటర్లు టీడీపీ-జనసేనలో చేరగా మరో ఆరుగురు పార్టీ మారితే మేయర్ పీఠం వైసీపీ చేజారడం ఖాయం. ఈ నేపథ్యంలో వైసీపీ మేయర్ పీఠాన్ని కాపాడుకోవడానికి తనదైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. కార్పోరేటర్లను క్యాంపులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు.ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పీఠం చేజారకుండా చర్యలు చేపడుతుండగా టీడీపీ-జనసేన నేతల వ్యూహాలు ఏ విధంగా ఉంటాయోనన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -