- Advertisement -

సోషల్ మీడియా పోస్టులు..పోలీసులపై హైకోర్టు ఫైర్

- Advertisement -

సోషల్ మీడియా అరెస్ట్ లపై పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోపం వస్తున్నా నియంత్రించుకుంటున్నాం అంటూ పోలీసుల తీరుపై మండిపడింది ఏపీ హైకోర్టు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యంగ్యంగా పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా? అలా అయితే సినిమా హీరోలను, విలన్ లను కూడా అరెస్ట్ చేయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

తాజాగా గుంటూరుకు చెందిన ప్రేమ్ కుమార్ సోషల్ మీడియాలో గుంటలు పూడ్చాలి అంటే ఊరూరా టోల్ కట్టాల్సిందే అంటూ ఒక పోస్ట్ పెట్టాడు.. దీనిపై కర్నూల్ లో టీడీపీ నేత ఫిర్యాదుతో కర్నూల్ పోలీసులు గుంటూరుకు వెళ్లి ప్రేమ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ప్రేమ్ కుమార్ కొడుకు హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ జరగగా, కోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

కర్నూల్ సీఐని ఈ కేసుల్లో స్పందించినంత వేగంగా మిగతా కేసుల్లో స్పందిస్తున్నారా? ఇప్పటి వరకు ఎన్ని కేసులను ఇలా మెరుపు వేగంతో విచారించారు అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ప్రేమ కుమార్‌ను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా? అంత అత్యవసరంగా అరెస్టు చేయాల్సినంత కేసా ఇది? అని ప్ర‌శ్నించింది. నాట‌క‌రూపంలో ప్ర‌భుత్వాన్ని సెటైరిక‌ల్‌గా విమర్శించినందుకు కేసు పెడితే ప్రతి సినిమా హీరోను, ప్రతి నటుడిపై కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సి ఉంటుందని ఏపీ హైకోర్టు అభిప్రాయ‌ప‌డింది. ప్ర‌భుత్వాన్ని వ్యంగ్యంగా విమర్శిస్తూ ఫ్లకార్డులు ప్ర‌ద‌ర్శించ‌డం త‌ప్పా..? అని పోలీసులను కోర్టు నిలదీసింది. ఇది విద్వేషాలను రెచ్చగొట్టడం అవుతుందా..? అని ప్ర‌శ్నించింది. కేవలం పోలీసులను మాత్రమే తప్పుపడితే సరిపోదని, తమ మేజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాల్సి ఉందని హైకోర్టు తెలిపింది. పోలీసులు ఏం దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్ విధించేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది.

సోష‌ల్ మీడియాలో ప్రేమ్‌కుమార్ రీల్ చూసి ఫిర్యాదు చేస్తే వెంట‌నే ఎలా రియాక్ట్ అవుతున్నారు..? వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించినందుకు బలవంతపు వసూళ్లకు పాల్చడ్డారంటూ కేసు పెడతారా? అరెస్టు సమయంలో పోలీసులు రిక‌వ‌రీ చేసింది రూ.300 మాత్ర‌మేన‌ని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -