Thursday, May 8, 2025
- Advertisement -

ఇప్పుడుకూడా సీఎం మీషం మెలేయ‌గ‌లారా…? విచార‌ణ‌, అరెస్ట్ త‌ప్ప‌దా..?

- Advertisement -

ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ అక్రమ లావాదేవీలు, బినామీ వ్యవహారాలను ఆదాయపన్ను శాఖ రట్టు చేసింది. సబ్‌ కాంట్రాక్టుల ముసుగులో పనులు చేయకుండానే చేసినట్లుగా చూపించి బిల్లులు కాజేయటం, ఆ డబ్బులను చిరునామా లేని కంపెనీల్లోకి మళ్లించి తరువాత వాటి నుంచి సీఎం రమేశ్‌ సంస్థ నగదు వెనక్కి తీసుకున్నట్లు ఐటీ అధికారులకు కచ్చితమైన ఆధారాలు లభ్యమయ్యాయి.

ఐటి సోదాల్లో రూ 100 కోట్ల దారిమళ్ళింపు కాస్త రూ 800 కోట్లకు పాకుతోంది. 100 కోట్ల రూపాయలు దారిమళ్ళాయని ఐటి అధికారులు నిర్ధారించగా తాజాగా మరో 700 కోట్ల రూపాయల అనుమానాస్పద లావాదేవీలు బయటపడ్డాయని సమాచారం. దాంతో త్వరలో సిఎం రమేష్ ను ఐటి అధికారులు విచారణ నిమ్మితం అదుపులోకి తీసుకుంటారనే ప్రచారం ఊపందుకుంది. దీనికి సంబంధించిన ఐటీ ఆధారాల‌ను భాజాపా ఎంపీ జీవీఎల్ బ‌య‌ట‌పెట్టారు.

డొల్ల కంపెనీలను ఏర్పాటు చేయటం ద్వారా 100 కోట్ల రూపాయలను దారిమళ్ళించారనేందుకు ఐటి అధికారులకు పక్కా ఆధారాలు లభించాయి. అదే సమయంలో మరో 700 కోట్ల రూపాయల అనుమానాస్పద లావాదేవీలను కూడా ఐటి గుర్తించిందట. ఈ లావా దేవీల‌కు సంబంధించిన లెక్క‌లు సాయిబాబా సమాధానం చెప్పలేకపోయారు.

ఆ డబ్బు మొత్తం టిడిపిలోని ఓ కీలక యువనేతకు చెందిన ఇంధన తయారీ కంపెనీలోకి చేరిందన్నది అనుమానం. జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే సిఎం రమేష్ అడ్డంగా బుక్కయ్యేట్లే కనబడుతోంది. మరి ఇపుడు కూడా సిఎం రమేష్ మీసం మెలేయగలరా ? దీనిలో మ‌రో కోనం కూడా బ‌య‌ట‌ప‌డింది.

కొందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డబ్బుల చెల్లింపు వ్యవహారంలోనూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ పాత్ర ఉన్నట్లు ఐటీ సోదాలతో వెలుగులోకి వస్తోంది. వైఎస్సార్‌ సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ముట్టజెప్పిన సొమ్ములో కొంత డబ్బును సీఎం రమేష్‌ కంపెనీల ద్వారా చేరవేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిలో క్లారిటీ రావాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -