రాష్ట్రంలో జగన్ తాను మేనిఫెస్టో లో ఇచ్చిన అన్ని వాగ్దానాలు నెరవేర్చడమే కాకుండా వాటి అమలు ఎలా జరుగుతుందని ప్రజల వద్దకు వెళ్లి మరీ అయన తన పాలనా ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. ఏది ఎలా ఉన్నా గతంలో ఏ సీఎం చేయని పనిచేస్తున్నారని ఆయనను ప్రజలంతా పొగుడుతున్నారు.. ప్రతి ఒక్క నాయకుడు ఎదో చేసేస్తామని, బ్రతుకులు మార్చేస్తామని చెప్పి ఎన్నికలప్పుడు కనపడిన వ్యక్తి మళ్ళీ ఎన్నికలకు దాకా కానీ కనిపించదు అలాంటిది జగన్ మీద నమ్మకం తో ఓటు వేస్తే ఇన్నాళ్లకు ఒక మంచి నాయకుడొచ్చాడని ప్రజలు చెప్పుకుంటున్నారు..
ఇక రాష్ట్రంలో వైసీపీ కి ఇష్టం లేకపోయినా ఓ పథకాన్ని ఎత్తివేయడం విపక్షాలకు ఆయుధంగా తయారైంది.. అయితే ఇది కేంద్రం వత్తిడి తోనే అని ప్రజలకు తెలిసినా జగన్ ను ఈ విధంగా నైనా బ్యాడ్ చేయాలనీ ని ముఖ్యనేతలంతా అనేక రకాల విన్యాసాలు చేస్తున్నారు. ఇక చంద్రబాబు అండ్ కో అయితే ఈ విషయాన్నీ నేషనల్ స్థాయిలో జగన్ విమర్శించేలా ప్లాన్ చేస్తున్నారు.. అసలు ఈ పథకం రద్దుకు అసలు కారకులైన పార్టీ ని పక్కనే పెట్టుకుని అధికార ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తే ఏమొస్తుందో అర్థం కావట్లేదు.
జగన్ చెక్ పెట్టేశారని తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో…వాటిని కవర్ చేయడానికి సలహాదారు కల్లాం అజేయరెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ఆయన తనదైన వాదన వినిపించారు. ఈ సమావేశంలో విద్యుత్ విషయంలో వైఎస్ఆర్ చేపట్టిన సంస్కరణలను జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని..అందుకే ఉచిత విద్యుత్ కు బదులు నగదు బదిలీని ప్రవేశ పెడుతున్నారని వెల్లడించారు. ఇక ఏపీ విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తమ తప్పేం లేదని.. అంతా.. కేంద్రం తప్పేనని అన్నారు.. ఇక మంత్రి రైతులు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.ఏదేమైనా వైసీపీ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు ఖాతాల్లో జమచేస్తామని చెప్పి కేంద్రం చేసిన తప్పును తన మీద వేసుకుని ఇలా ప్రజలకు జవాబుచెప్పడం ప్రజలకు ఎంతో సానుకూలదృక్పధం ఏర్పడిందని చెప్పొచ్చు..