Wednesday, May 7, 2025
- Advertisement -

పాద‌యాత్ర‌కు త‌గిన బ‌ధ్ర‌త క‌ల్పించండి….

- Advertisement -

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఈనెల ఆర‌వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 6 నెల‌ల‌పాటు ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర పేరుతో పాద‌యాత్ర చేప‌డుతున్న సంగ‌తి తెల‌సిందె. అయితె పాద‌యాత్ర‌ను అడ్డుకునేందుకు అధికార‌పార్టీ టీడీపీ కుట్ర‌ల‌కు పాల్ప‌డుతోంద‌నె విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అనుమ‌తి తీసుకోకుండా పాద‌యాత్ర ఎలా చేస్తార‌ని ఏపీ డీజీపీ వ్యాఖ్యానించారు. పాద‌యాత్ర‌లో ఏదైనా విధ్వంసాలు జ‌ర‌గ వ‌చ్చునంటు సాక్షాత్తు చంద్ర‌బాబె వ్యాఖ్యానించారు. వీట‌న్నింటిని దృష్టిలో ప‌ట్టుకొని జ‌గ‌న్ డీజీపీకి లేఖ రాశారు.

పాద‌యాత్ర‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఏపీ డీజీపీ సాంబశివరావుకు జగన్ ఓ లేఖ రాశారు. ఈ నెల 6 నుంచి తాను పాదయాత్ర తలపెట్టానని, ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర జరుగుతుందని, జిల్లాల వారీగా పోలీసులకు రూట్ మ్యాప్ అందజేస్తామని ఆ లేఖలో జగన్ పేర్కొన్నారు. ఏడు నెలల పాటు జరిగే పాదయాత్రకు తగిన భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డీజీపీకు విజ్ఞప్తి చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -