2019 ఎన్నికల్లో పవన్ తీసుకోబోతున్న నిర్ణయం ఏపీ రాకీయాలను మార్చి వేయనుందా…? పవన్ తాజాగా తీసుకోబోతున్న నిర్ణయం భాజాపా-టీడీపీ కూటమికి చుక్కలు కనిపింనున్నాయా..? ఎన్నికలకు ఒంటరిగా వెల్లేందుకు జనసే ఛీప్ నిర్ణయించుకున్నారు అనే దానికి ఆయన తీసుకున్న నిర్ణయమే నిదర్శనం.
జనసేనను త్వరలోనే జనంలోకి తీసుకొస్తామని ఆ మధ్య పవన్ కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ప్రజా స్పందన చూశాకనే వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీకి దిగాలనేది కూడా నిర్ణయిస్తామన్నారు. అయితె ఎన్నికల్లో కి ఎలాంటి అంశాలు తీసుకెల్తున్నారనె సందేహం ఉండేది. ఇప్పుడు అవన్ని పటాపంచలయ్యాయి. తాజాగా జనసేన పార్టీ ట్విట్టర్ అకౌంట్లో కొన్ని అంశాలపై పవన్ స్పందించిన తీరు ఆసక్తికరంగా ఉంది.
ట్విట్టర్‌లో చంద్రబాబుకు, భాజాపాకు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. ఒక సమస్యకు పరిష్కారం కావాలంటే లక్షమందికి అన్యాయం జరగాలంటే కుదురుతుందా అన్నారు పవన్. ఒకవైపు స్పెషల్ స్టేటస్ ఇవ్వరూ, ఉద్యోగాలు క్రియేట్ చెయ్యరు, ఉన్నవి కూడా తీసేస్తారూ అంటే కడుపుమండి అది ఏ రూపం తీసుకుంటుందో అనే ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా పెట్టిన ఈ ట్వీట్లలో ప్రత్యేక హోదా గురించి పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టంగా స్పందించడంతో ఇప్పుడు ఇది హాట్ టాఫిక్‌గా మారింది. హోదా ఇవ్వరూ, ఉద్యోగాలు సృష్టించరూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగున పడిన ప్రత్యేకహోదా అంశాన్ని మరో సారి పవన్ తెరమీదకు తీసుకొచ్చారు. ఇప్పటికె అన్ని పార్టీలు దీన్ని పక్కన పెట్టేశాయి. ఇలాంటి నేపథ్యంలో మరోసారి ప్రత్యేక హోదాపై ఏదో ఒకటి చేస్తారనే సంకేతాలు జనసేన ఇచ్చినట్టు అవుతోంది.
గతంలో పాదయాత్ర లాంటింది ఉంటుందని ముందుగా అనుకున్నా, వేరే రూపంలో ఇతర మాధ్యమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలు ఉంటాయనీ తరువాత పవన్ క్లారిటీ ఇచ్చేశారు. వాస్తవానికి, ప్రత్యేక హోదా మీదే గతంలో కొన్ని సభలు పెట్టారు పవన్. హోదాకు బదులుగా కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డులతో పోల్చారు. ఆ మధ్య విశాఖలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. దానికి ట్వీట్ల ద్వారానే పవన్ మద్దతు ఇచ్చారు.
మళ్లీ ఇప్పుడు ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇదే నినాదాన్ని పవన్ వచ్చె ఎన్నికల్లో ప్రజల మధ్యకు తీసుకెల్తే పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. జనసేన దీన్ని ప్రజల్లోకి తీసుకెల్తే మాత్రం భాజాపా,టీడీపీ కు చుక్కులు కనిపిండం ఖాయం.