2019 సార్వత్రిక ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఎలాజరుగుతాయోమో గాని ఏపీలో మాత్రం సంచలనం సృష్టిస్తాయి. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నాయి. పార్టీలన్నీ ఒంటరిగా పోటీ చేసినా అధికారం మాత్రం పొత్తుపైనె ఆధార పడిఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇప్పుడు కాకపోయినా ఎన్నికల సమయానికి ఏదోక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందే.
ఇప్పుడు తాజాగా జనసేన, వైసీపీ రెండు పార్టీల పొత్తుపైనె అందరిలో ఆసక్తి నెలకొంది. ఆ దిశగా సంకేతాలు వెలువడుతున్నాయనె చెప్పవచ్చు. జనసేన తరఫున ఆ పార్టీ మీడియా హెడ్ హరిప్రసాద్ స్పందించారు. రెండు పార్టీలు వేరైనా ఆశయం ఒకటే కాబట్టి. ‘ప్రత్యేక హోదా కోసం ఎవరితోనైనా కలిసి పోరాటం చేయడానికి సిద్ధం. అవసరమైతే వైఎస్సార్సీపీతోనూ కలిసి ముందడుగు వేస్తాం..’ అని గతంలో స్వయంగా పవన్‌కళ్యాణ్ ప్రకటించిన విషయం విదితమే. మళ్ళీ ఇప్పుడు అదే మాట, హరిప్రసాద్ నోట బయటకొచ్చింది.
ఇప్పటికె పవన్ కూడా వచ్చె ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించారు. టీడీపీ – బీజేపీ కలిసి ప్రత్యేక హోదాకి పాతరేసేశాయి. వైసీపీ, జనసేనలు పోరాటం చేస్తామని ప్రకటించి, కొంతమేర పోరాడి, అలసిపోయారు. అయితె ఇప్పుడు ప్రత్యేకహోదా మరో సారి తెరపైకి వచ్చింది.
బీజేపీ – టీడీపీ ప్రత్యేక హోదా అంశాన్ని పాతరేసేసినా, 2019 ఎన్నికల్లో అయితే మళ్ళీ ఆ ప్రత్యేక హోదా అంశం, రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయమై ముందస్తుగానే జనసేన పార్టీ సంకేతాలు పంపుతోంది. అధికార పార్టీపై విమర్శలు చేసినా …గడచిన మూడున్నరేళ్ళుగా ‘పసుపు’ భావజాలాన్నే నింపేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్‌తో జతకట్టడం అంతతేలికకాదనె విషయం తెలిసిందే. కాని రాజకీయాల్లో ఎప్పుడు ఏంజరుగుతుందో ఎవరు చెప్పలేరు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.