పవన్ ఉత్యరాంధ్రపర్యటనలో అంతా హైడ్రామాగా సాగింది. అజ్ణాతవాసి సినిమా షూటింగ్ అయిపోయితర్వాత ప్రజాసమస్యలు గుర్తుకొచ్చి ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. విశాఖలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమ ప్రయివేటు పరానికి వ్యతిరేకంగా ఉద్యోగి ఆత్మహత్య చేసుకన్న కుటుంబాన్ని పరామర్శించి..మరుసటి రోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఇదంతా బాబు డైరెక్సన్‌లో పవన్ మూడు రోజుల షాటింగ్ జరిగిందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పర్యటనలో పవన్ జగన్ నామస్మరన చేయడం ఇక్కడ గమనించవచ్చు.
పవన్ మాటల్లో రెండు విషయాలు స్పష్టంగా కనబడుతోంది. మొదటిది వీలైనంతలో గురువు చంద్రబాబునాయుడు పేరు ప్రస్తావించకుండా ఉండటం. ఇక, రెండోది వీలైనన్ని సార్లు ప్రధాన ప్రతిపక్షం వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పేరును హైలైట్ చేయటం. అయితే దీనివెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది.
పవన్ వచ్చింది వేరు ఆయన మాట్లాడింది మరోకటి. చంద్రబాబుకు ఇబ్బందులు కల్గించిన ఏ అంశాన్ని ప్రస్తావించాల్సి వచ్చినా, పవన్ వైసిపి లేదా జగన్ పేరును మాత్రమే చెబుతున్నారు. మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించిన పవన్ అనేక సమావేశాల్లో ప్రసంగించారు. మొత్తం మీద వైసిపి లేదా జగన్ పేరును సుమారుగా వందసార్లైనా ప్రస్తావించి ఉంటారు. ఎందుకు అలా ప్రస్తావించారు?
రాష్ట్రంలో గడచిన మూడున్నరేళ్ళలో చంద్రబాబు ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయ్. విభజన హామీల అమలు కావచ్చు, మరోటి కావచ్చు. ప్రత్యేకహోదా విషయంలో బాబు విఫలమయ్యారు. ఇక రాజధాని విషయంలోకూడా బాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో పక్క పోలవరం అవినీతి.
పోలవరంలో అవినీతి తారాస్థాయికి చేరిందని జాతీయ స్థాయి సర్వే సంస్థలుకూడా కోడై కూశాయి. దీంతో కేంద్రం బాబుకు సహకరించడలేదు దీంతో ఒడ్డున పడ్డ చేపలా బాబు కొట్టుమిట్టాడుతున్నాడు. జగన్ ప్రత్యేకహోదా విషయంలో అనేక సదస్సులు నిర్వహించారు. ప్రతిపక్షాలను కలుపుకుని అనేక ఆందోళనలు చేసారు. వివిధ ప్రాంతాల్లో దీక్షలు కూడా చేసారు. అసెంబ్లీలో కూడా చాలా సార్లు మాట్లాడారు. కాని ప్రభుత్వం మాత్రం వైసీపీమీద ఎదురుదాడి చేయడంతో ఇక కుదరదని పాదయాత్ర ద్వారా జగన్ ప్రాజల్లోకి వెల్లాడు.
పాదయాత్రలో కూడా ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై చంద్రబాబును వైసిపి ఎండగడుతూనే ఉంది. సందర్భం వచ్చినపుడల్లా ప్రభుత్వాన్ని వైసిపి దుమ్ము దులిపేస్తోంది. ప్రస్తుతం జగన్ పాదయాత్రలో చేస్తున్నది కూడా అదే. ఇక్కడే పవన్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఎక్కడ మాట్లాడాల్సి వచ్చినా చంద్రబాబు పేరును కాకుండా కేవలం జగన్ లేదా వైసిపిని మాత్రమే టార్గెట్ చేశారు.
తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఒక మాట అనాల్సి వచ్చినపుడల్లా ప్రతిపక్ష పార్టీ మీద, ప్రతిపక్ష నేత జగన్ మీద రెండు రాళ్లు వేస్తూ వస్తున్నారు. బ్యాలెన్స్ చక్కగా మెయింటెన్ చేశారు. ఎంతైనా సినిమా యాక్టర్ కదా..!