Thursday, May 8, 2025
- Advertisement -

రూ.10 కోట్లతో లోకేష్ కుట్ర ఇది…ప‌వ‌న్ ట్వీట్‌

- Advertisement -

ప‌వ‌న్‌పై దుస్ప్ర‌చారం చేస్తున్న ప‌చ్చ‌మీడియా, చంద్ర‌బాబు, లోకేష్‌ల‌ను ఉతికి ఆరుశాడు జ‌న‌సేనుడు ప‌వ‌న్ క‌ళ్యాన్‌. శ్రీరెడ్డి వ్యవహారం ఇటీవల క్యాస్టింగ్ కౌచ్‌ నుంచి హఠాత్తుగా పవన్‌ కల్యాణ్ మీదకు మ‌ళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారాన్ని అడ్డం పెట్టుకుని జ‌గ‌న్ మీద బుర‌ద‌జ‌ల్లే ప్య‌య‌త్నం చేసిన ప‌చ్చ బ్యాచ్‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు ప‌వ‌న్‌.

పవన్‌ ను శ్రీరెడ్డి బూతులు తిట్టారు. ఆ తర్వాత వర్మ… ఆమెతో అలా తిట్టించింది తానేనని ప్రకటించారు. వర్మ వెనుక ఏదో రాజకీయ పార్టీ ఉందంటూ టీడీపీ అనుకూల మీడియానే పీలర్ వదిలింది. ఆ వెంటనే శ్రీరెడ్డి వెనుక వైసీపీ ఉందంటూ కథనాలు, ఒక లింక్‌ లేని ఆడియో టేపును ప్రసారం చేశాయి.

అయితే జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నేరుగానే ఈసారి స్పందించడంతో టీడీపీ అనుకూల మీడియా ఎత్తులు పారలేదు. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో పవన్‌ కల్యాణ్ ట్విట్టర్లో విరుచుకుపడ్డారు. నారా లోకేష్, టీవీ9 రవిప్రకాశ్‌, ఏబీఎన్‌, మరికొన్ని టీడీపీ అనుకూల టీవీ చానళ్లపై పవన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడానికి అండగా నిలబడ్డ నాకు చంద్రబాబు నాయుడు గొప్ప ప్రతిఫలం ఇచ్చారు. సచివాలయం వేదికగా లోకేశ్‌, అతని సన్నిహితుడు, అనుకూల టీవీచానెల్స్‌తో కలిసి నా కుటుంబంపై ఆరు నెలలుగా నిరవధిక అత్యాచారం జరిపారు, జరిపిస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

దిగువ మధ్యతరగతి నుంచి వచ్చి, భర్త, పిల్లలే ప్రపంచంగా జీవించి, ఎవరికీ అపకారం చేయని తన మాతృమూర్తిపై కొందరు వ్యక్తులతో దారుణంగా తిట్టించారని, అలా తిట్టడానికి రూ.10 కోట్లు ఇచ్చారని, దర్శకుడు వర్మ, ప్రముఖ చానెల్‌ యజమాని, దాని నిర్వాహకుడు, నారా లోకేశ్‌, అతని స్నేహితులు కలిసి చేస్తోన్న దారుణాలు చంద్రబాబుకు తెలియదంటే నమ్మాలా? అని పవన్‌ పేర్కొన్నారు.

గతంలో అమ్మాయిలు కనిపిస్తే ముద్దయినా పెట్టాలి… కడుపైనా చేయాలంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఇదే తరహాలో మీడియా ఎందుకు ట్రీట్ చేయలేదని ప్రశ్నించారు. కేవలం పవన్‌ కల్యాణ్‌, పవన్‌ కల్యాణ్ తల్లి విషయంలో మాత్రమే ఇలాంటి బూతు మాటలపై చర్చలు పెడతారా… దీనిపై శ్రీమంతులైన, శక్తివంతులైన మీడియా యజమానులు చెప్పాలని పవన్‌ కల్యాణ్ నిలదీశారు.

మొత్తం మీద శ్రీరెడ్డి ద్వారా పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాన్ని నాశనం చేసి.. ఆ తర్వాత నిందను వైసీపీ మీదకు మళ్లించేందుకు టీడీపీ మీడియా చేసిన ప్రయత్నాలు ఈసారి బెడిసికొట్టాయి. దీనిపైన టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -