Tuesday, May 13, 2025
- Advertisement -

ఏమయ్య ప‌వ‌న్‌ నీ ఊహాతీత చ‌ర్య‌లు

- Advertisement -

రాజ‌కీయాల్లో ఎవ‌రు మిత్ర‌ప‌క్షం, ఎవ‌రు ప్ర‌తిప‌క్షం ఉంటారో ఎవ‌రూ ప‌క్క‌గా చెప్ప‌లేరు. రాజ‌కీయాలు అంటేనే ఊస‌ర‌వెల్లి మాదిరిగా రంగులు మార్చ‌డ‌మే. ఇయాల ఒక పార్టీలో ఉండ‌గా తెల్లారేస‌రికి మ‌రో పార్టీలో ఉంటారు. ఇవ‌న్నీ రాజ‌కీయ నాయ‌కుల‌కే సాధ్యం. ఒక‌సారి శ‌త్రువు.. రాక్ష‌సి.. అని అమ్మ‌నా బూతులు తిట్టిన పార్టీ, నాయ‌కులే తిరిగి ఆ పార్టీలో చేరి ఆ పార్టీలో, ఆ నాయ‌కుడి వంచ‌న చేరుతారు. ఇవ‌న్నీ ప్ర‌జ‌ల‌కు ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. ఇప్పుడు ఇదే విష‌యం జ‌న‌సేనుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యంలో జ‌రుగుతోంది.

ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మ స‌మ‌యంలో 2014లో రాజ‌కీయాల్లోకి ప‌వ‌న్ వ‌చ్చాడు. అప్పుడు వ‌చ్చి తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్‌) పార్టీని బండ బూతులు తిట్టాడు. ముఖ్యంగా క‌ల్వంకుట్ల కుటుంబాన్ని ల‌క్ష్యంగా చేసుకొని విమ‌ర్శ‌లు చేశాడు. అందులో భాగంగా కేసీఆర్ కుమార్తె కవిత‌ను కూడా విమ‌ర్శించాడు.. ఎన్నిక‌ల త‌ర్వాత కూడా అవి కొన‌సాగాయి. అయితే త‌ర్వాత ప‌వ‌న్‌లో ఎందుకు మార్పు వ‌చ్చిందో తెలియ‌దు. కానీ క‌ల్వ‌కుంట్ల కుటుంబం త‌న‌కు ఓ కుటుంబం అని ప్ర‌క‌టించేశాడు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత త‌న‌కు చెల్లెలు అని ప్ర‌క‌టించాడు.

లోక్‌స‌భ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంపీల ఆందోళ‌న‌కు నిజ‌మాబాద్ ఎంపీగా ఉన్న క‌విత మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అంతేకాకుండా జై ఆంధ్ర అంటూ త‌న ప్ర‌సంగం ముగించారు. దీనికి స్పందించిన ప‌వ‌న్ ట్విట్ట‌ర్‌లో `చెల్లెలు కవిత గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఏపీ ప్రజలకు మద్దతు పలికినందుకు సంతోషంగా ఉంది` అని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -