Friday, May 9, 2025
- Advertisement -

ప్ర‌జా సమస్యలపై పోరాటం చేస్తాను… ప్రభుత్వాలు ఏం పీక్కుంటాయో పీక్కోండి: ప‌వ‌న్‌

- Advertisement -

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ స‌మ‌స్య‌ల‌పై పోరాటానికి ప్ర‌జాక్షేత్రంలోకి దిగారు. విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డిసిఐ) సంస్ధను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోంద‌ని.. అందుకు నిరసనగా వెంకటేశ్ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్త‌రాధ్ర ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌వ‌న్ డిసిఐ ఉద్యోగులకు మ‌ద్దుత తెలిసిన ప‌వన్ మ‌ద్ద‌తు తెలిపారు.

డ్రెజ్జింగ్ కార్పోరేష‌న్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, టిడిపి, భాజపా ప్రజాప్రతినిధుల ముందే ప్రైవేటీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నా ఎంపిలు అవంతి శ్రీనివాస్, కంభంపాటి హరిబాబు చూస్తు ఊరుకోవటం దారుణమన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేని వారికి వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని పవన్ తేల్చేశారు. ఎంపీలు ప్ర‌జాస‌మ‌స్య‌ల‌నుంచి త‌ప్పించుకోవ‌చ్చేమోగాని నేను కాద‌న్నారు.

సమస్యలను లేవదీయటానికే, సమస్యలపై పోరాటాలు చేయటానికే తాను జనసేన పార్టీని ఏర్పాటు చేసిన విషయాన్ని పవన్ గుర్తు చేసారు. పోయిన ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల తాను టిడిపి, భాజపాలకు మద్దతు ఇచ్చినట్లు పవన్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఏదో అద్భుతం జరుగుతుందన్నారు. అయితే, అదేంటో మాత్రం ప‌వ‌న్‌ చెప్పలేదు.

ప్ర‌జా సమస్యలను పరిష్కరించలేని టిడిపి, భాజపాలను నిలదీయటానికి తాను ముందుంటానన్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారు ప్రజా సమస్యలను పట్టించుకోకపోతే ఎలా అంటూ మిత్రపక్షాల నేతలపై మండిపడ్డారు. తాను టిడిపి, భాజపాల పక్ష కాదని, ప్రజాపక్షమంటూ ప్రకటించారు. తాను సమస్యల గురించే ప్రస్తావిస్తానని, సమస్యలపై పోరాటం చేస్తానని ప్రభుత్వాలు ఏం పీక్కుంటాయో పీక్కోండంటూ సవాలు విసిరారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయటంలో తాను జైలుకు వెళ్ళటానికి, లాఠీ దెబ్బ‌లు తిన‌డానికి కూడా సిద్ధమన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -