Friday, May 9, 2025
- Advertisement -

టీడీపీకి నైతికంగా పెద్ద దెబ్బే…

- Advertisement -

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తటస్థంగా ఉంటామని ప్రకటించిన జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ భూమా ఫ్యామిలీకి షాకిచ్చారు. ఈ ఎన్నికల్లో ప తమకు మద్దతిస్తారని ఆశించిన భూమా ఫ్యామిలీకి నిరాశే ఎదురైంది. కీల‌క స‌మ‌యంలో పవన్‌కళ్యాణ్ ఏ పార్టీకి కూడ మద్దతివ్వబోనని ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

పవన్‌కళ్యాణ్‌కు తమ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని ఏపీ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ సోదరి మౌనిక మూడు రోజుల క్రితం ప్రకటించారు. పవన్‌ మద్దతు తమకే ఉంటుందనే ధీమాను మౌనిక వ్యక్తం చేశారు. కానీ చివరకు నిరాశే ఎదురైంది. మంత్రి అఖిలప్రియ కూడ పవన్‌తో తమ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యాన్ని ఎన్నికల సందర్భంగా అప్పుడప్పుడూ ప్రస్తావించారు.

నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ మ‌ద్ద‌తివ్వ‌కుండా వ్యూహాత్మ‌కంగానె వ్యవ‌హ‌రించార‌నె అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. మూడేళ్ళ పాటు ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టిన పవన్ ఈ సమయంలో టిడిపికి మద్దతిస్తే రాజకీయంగా తప్పుడు సంకేతాలను పంపించినట్టు అవుతోందనే కారణంతో జనసేన ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాయలసీమ ప్రాంత జనసేన కార్యకర్తలను అడిగి, ఓటర్ల నాడి తెలుసుకున్న తరువాత పవన్ ఈ నిర్ణయానికి వచ్చారని అనుకోవాలి. సార్వత్రిక ఎన్నికల లోగా వచ్చే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయమని తేల్చేసారు. నంద్యాల ఫీడ్ బ్యాక్‌లో తెలుగుదేశానికి అనుకూలమైన సీన్ లేక‌పోవ‌డంతో ప‌వ‌న్ ఈ నిర్న‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అలాంటి సీన్ వుండి వుంటే, పవన్ అటే మొగ్గి వుండేవారు. ఇప్పుడు అలా మొగ్గి అభాసు కావడం పవన్ కు ఇష్టం లేదని తేలిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -