ఎన్నికల ఎఫెక్ట్‌తో వైసీపీ, టీడీపీలో జంపింగ్ జిలానీలు ఎక్కువవుతున్నారు. ఎక్కువగా టీడీపీనుంచి వైసీపీలోకి జంపింగ్ చేస్తుంటే…ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి జంపింగ్ చేస్తున్నారు. పార్టీలో టికెట్ రాదని తెలిసిన నాయకులు తమ భవిష్యత్తుకోసం ఇతర పార్టీల వైపు చేస్తున్నారు. తాజాగా మరో వైసీపీ నేత టీడీపీలో చేరుతున్నానని ప్రకటించారు.
కాకినాడకు చెందిన వైసీపీ నేత చలమలశెట్టి సునీల్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం అయ్యింది. రేపు బాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. తన మనోభావాలను వైసీపీ దెబ్బతీసిందని సునీల్ ఆరోపించారు. . దీంతో రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నట్లు తెలిపారు. కానీ చంద్రబాబు తనను పిలిచి ‘నీలాంటి వారు రాజకీయాల్లో ఉండాలని’ చెప్పారని ఆయన గుర్తుచేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున కాకినాడ ఎంపీగా పోటీ చేసిన సునీల్ ఓడిపోయారు. అందుకోసమే రేపు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చలమలశెట్టి సునీల్‌తో పాటు పెద్దాపురం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాల వైసీపీ మాజీ కోఆర్డినేటర్లు తోట సుబ్బారావునాయుడు, ముత్యాల శ్రీనివాస్, కాకినాడ కార్పొరేషన్ కార్పొరేటర్లు కంపర రమేష్, పలకా సూర్యకుమారి తెలుగుదేశంలో చేరనున్నారు.