Monday, May 5, 2025
- Advertisement -

విశాఖ‌ వైసీపీలోకి భారీ చేరిక‌లు…

- Advertisement -

విశాఖ జిల్లా పాదయాత్రలో జగన్ కు జనం బ్రహ్మరధం పడుతున్నారు. అదే టైంలో అనేకమంది వివిధ పార్టీల నాయ‌కులు, సామాజిక వేత్త‌లు కూడా పార్టీలో చేరుతున్నారు. వీరిలో విద్యావంతులు, రాజకీయాలకు కొత్త వారు కూడా ఉన్నారు. జగన్ వచ్చిన వారిని ఆలాగే చేర్చుకుంటున్నారు. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు వ‌స్తున్న స్పంద‌న‌ను చూసి వారంతా వైసీపీలో చేరుతున్నారు.

తాజాగా విశాఖ జిల్ల‌కుం చెందిన కళా ఆసుపత్రి అధినేత, ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ పి. వి. రమణ మూర్తి బుధవారం ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి, ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు నగరంలో మంచి కార్పోరేట్ హాస్పిటల్ ఉంది. ఆర్ధికంగానె కాదు, సామాజికంగా బలమనిన నేపధ్యం ఉన్న ఆ డాక్టర్ గారి చేరికతో పార్టీకీ మ‌రింత బూస్ట్ వ‌చ్చింది.

రమణ మూర్తితో పాటు ఆయన సతీమణి డాక్టర్ కళావతి, ఆయన మామ రామారావులు, పెద్ద ఎత్తున ఆయన అనుచరులు ఈ సందర్భంగా పార్టీలో చేరారు. వీరందర్నీ శ్రీ జగన్ గారు, పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డిగారు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -