Sunday, April 28, 2024
- Advertisement -

లోకేశ్ పాదయాత్ర..లైన్ క్లియర్ కానీ !

- Advertisement -

గత కొన్ని రోజులుగా నారా లోకేశ్ పాదయాత్రపై సందిగ్ధత కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టబోతున్నారు. ఈ పాదయాత్ర వల్ల టీడీపీకి మంచి మైలేజ్ వస్తుందని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు. ఆరు నెలలుగా ఈ పాదయాత్రపై టీడీపీ శ్రేణులు గట్టిగానే కసరత్తులు చేసి రూట్ మ్యాప్ కూడా సిద్దం చేసుకున్నారు. ఈ నెల 27 నుంచి కుప్పంలో లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు 4 వేల కిలోమీటర్ల దూరాన్ని 400 రోజుల్లో ఈ పాదయాత్రను పూర్తి చేసే విధంగా లోకేశ్ సిద్దమయ్యారు..

అయితే లోకేశ్ పాదయాత్రను వైసీపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని టీడీపీ శ్రేణులు గట్టిగానే విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే జీవో నెంబర్ ఒన్ జగన్ సర్కార్ తీసుకొచ్చిందని వారి భావన. అంతే కాకుండా లోకేశ్ పై దాడులు చేసేందుకు కూడా కుప్పంలో వైసీపీ శ్రేణులు ప్లాన్ చేస్తున్నారని టీడీపీ నుంచి వినిపిస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలో లోకేశ్ పాదయాత్రకు పోలీసుల నుంచి అనుమతి లభిస్తుందా ? లేదా అనేది గత కొన్ని రోజులుగా సంధిగ్డంలో ఉంది.

అయితే తాజాగా లోకేశ్ పాదయాత్రకు పోలీసుల నుంచి షరతులతో కూడిన అనుమతి లభించింది. 27 న కుప్పంలో బహిరంగ సభ ద్వారా లోకేశ్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇక యాత్రలో భాగంగా వాహనదారులకు, అత్యవసర సేవలకు ఇలాంటి ఇబ్బంధి కలిగించరాదని షరతు పెట్టారు. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించరాదని, రోడ్ల పై సమావేశాలు నిర్వహించరాదని, బాణసంచా పేల్చరాదని.. ఇలా 14 షరతులతో లోకేశ్ పాదయాత్రకు అనుమతి ఇచ్చారు పోలీసులు. మొత్తానికి లోకేశ్ పాదయాత్రకు పోలీసుల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మరి లోకేశ్ పాదయాత్ర టీడీపీకి ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -