Saturday, May 3, 2025
- Advertisement -

మాజీ ఎమ్మెల్యేతోపాటు 1000 మంది వైసీపీలో చేరిక‌..

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ టీడీపీలో ఆందోళ‌న మొద‌ల‌య్యింది. జ‌గ‌న్ పాయ‌దాత్ర‌లో ఆ పార్టీకి వ‌ల‌స‌ల భ‌యం వెంటాడుతోంది. తాజాగా విశాఖ జిల్లాలో ఆపార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు, ఆయన కుమారుడు, విశాఖ డీసీసీబీ చైర్మన్‌ సుకుమార్‌ వర్మలు టీడీపీని వీడి శనివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వారికి కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఆయన వెంట జిల్లా తెలుగు యువత ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డీఎస్‌ఎన్‌ రాజు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌ రాజు, మండలి ప్రధాన కార్యదర్శి శంకర్‌ రావులతో పాటు వెయ్యి మంది వైఎస్సార్‌సీపీలో చేరారు. కన్నబాబు విశాఖపట్నం జిల్లా యలమంచిలి ఎమ్మెల్యేగా రెండు సార్లు పనిచేశారు. 2014 ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేరారు.

పార్టీలో చేరిక తర్వాత టీడీపీ, చంద్రబాబుపై మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఎలమంచిలిలో టీడీపీ గెలుపుకు సహకరించానని… కాని పార్టీ మాత్రం చిన్న చూపు చూసిందని విమర్శించారు. చంద్రబాబు, నారా లోకేష్‌లు తనను నమ్మించి మోసం చేశారన్నారు.

2014 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే టికెట్ ఆశించినా ద‌క్క‌లేదు. తర్వాత ఎమ్మెల్సీ పదవిపై ఆశ పెట్టుకున్నా దక్కలేదు. వైసీపీలో చేరుతార‌నే వార్త‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌తో మంత్రిగంటా శ్రీనివాస్ రావు చ‌ర్చ‌లు జ‌రిపినా ఫ‌లించ‌లేదు. ఇది టీడీపీకీ పెద్ద షాక్ అనడంలో సందేహంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -