ఢిల్లీలో కేజ్రీవాల్ ఓడిపోగానే చంద్రబాబు కొత్తరాగం అందుకున్నాడన్నారు మాజీ మంత్రి, వైసీపీ నేత కన్నబాబు. 2019 ఎన్నికల ముందు కేజ్రీవాల్ ఏపీకి వచ్చి చంద్రబాబు తరఫున ప్రచారం చేశాడు.. కానీ మొన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేశాడన్నారు.
గత ఎన్నికల్లో దేశానికి సరైన నాయకుడు మోదీ కాదన్న చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం రైట్ టైమ్.. రైట్ లీడర్ షిప్ అని ఊదరగొడుతున్నాడు అని ఎద్దేవా చేశారు. ఇక మంత్రులకి ర్యాంకుల కేటాయింపులో చంద్రబాబు లాజిక్ మిస్ అయ్యాడన్నారు. ఫైల్స్ క్లియరెన్స్‌కి సంబంధించి ర్యాంకులు ఇచ్చినప్పుడు.. అసలు ఎన్ని ఫైల్స్ వచ్చాయి? ఎన్ని క్లియర్ చేశారు? అనేది జనాలకి చెప్పాలి కదా చంద్రబాబూ? అన్నారు.
ఫైనాన్స్ మినిస్టర్‌కి లాస్ట్ ర్యాంక్ వచ్చిందంటే.. కూటమి ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని తేలిపోయిందన్నారు. బటన్ నొక్కడాలు.. ఉచిత హామీలు పనికిరావు అని చంద్రబాబు ఇప్పుడు అంటున్నాడు.. మరి ఎన్నికల్లో మీరు ఇచ్చిన ఉచిత హామీల సంగతేంటి చంద్రబాబూ? చెప్పాలన్నారు. చెప్పాడంటే చేస్తాడంతే అనేది వైయస్ జగన్ గుర్తింపైతే.. చెప్పాడంటే చేయడంతే అనేది చంద్రబాబు పాలసీ అని మండిపడ్డారు కన్నబాబు.
