Monday, May 12, 2025
- Advertisement -

పవన్ కల్యాణ్‌కు వీళ్లే గతా..?

- Advertisement -

జనసేన అధిపతి పవన్ కల్యాణ్ మాటలు చూస్తే వాడీవేడీగా ఉంటున్నాయి కానీ వాస్తవంలో ఆయన తీరు ఆ మాటలకు తగ్గట్టుగా లేదు. మొదటి నుంచి ఇదే కథే నడుస్తూ ఉంది. వచ్చేసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించాడు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం అంటే మాటలు చెప్పింత ఈజీ కాదు. అద్భుతాలు చేస్తామని మాటలు చెప్పడం వేరు వాస్తవంలో చూపడం వేరు కదా. పవన్ కల్యాణ్ తీరును గమనిస్తే ఈ విషయంపై మరింత స్పష్టత వస్తోంది.

ఇప్పుడు జనసేనలోకి చేరికలు మొదలయ్యాయి. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ అక్కడ పలువురు నేతలను పార్టీలోకి చేర్చుకొంటూ ఉన్నాడు. అయితే వీళ్లు ఎవరయ్యా? అంటే.. ఇప్పటికే అనేక పార్టీలు మారిన నేతలు. వివిధ పార్టీలు చేరి, అక్కడ కుదరక బయటకు వచ్చి, వేర్వేరు పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటలేని నేతలు ఇప్పుడు జనసేనలోకి చేరుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.

దాడి వీరభద్రరావుతో సహా ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్ పార్టీలోకి చేరుతున్న వాళ్లంతా ఇదే బాపతే. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్… ఇలా అన్ని చోట్లా నిరాదరణకు గురి అయిన వాళ్లు ఇప్పుడు జనసేనలో చేరుతున్న వైనం కనిపిస్తోంది. కాంగ్రెస్ లో చాలా మంది నేతలు ఖాళీగా ఉన్నారు. వీళ్లను టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు పట్టించుకోవడం లేదు కూడా. ఈ నేపథ్యంలో ఇలాంటి వారు ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారు.

మరి ఇలాంటి వారిని చేర్చుకుని పవన్ కల్యాణ్ సాధించేది ఏమిటి? రాజకీయాల్లో మార్పు తెస్తా, అద్భుతాలు చేసి చూపిస్తా అంటున్న పవన్ కల్యాణ్ తన పార్టీలోకి ఇలాంటి వారిని చేర్చుకొంటూ ఉండటం… ప్రహసనంగా మారుతోంది. ఇలాంటి వారి వల్ల జనసేన బలోపేతం కావడం అటుంచి, మరింత తేలిపోయే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -