Saturday, May 10, 2025
- Advertisement -

జేపీ భండారం ఇది…… మేథావి అనే ముసుగులో బాబు కోసం రాజకీయం

- Advertisement -

అవే రాజకీయ వ్యూహాలు, కుట్రలు. అంతా అదే తంతు. అందరూ కలిసి ఏం చేసైనా సరే చంద్రబాబును మరోసారి కుర్చీ ఎక్కించాలన్నదే లక్ష్యం. అంతకుమించి ప్రజా ప్రయోజనమన్న మాట మచ్చుకు కూడా లేదు. పవన్ కళ్యాణ్ మరీ కమెడియన్‌గా మిగిలిపోయాడు కాబట్టి ఇప్పుడిక మరో పచ్చ బ్యాచ్ సభ్యుడు జెపికి మేథావి అనే ట్యాగ్ ఇచ్చి పవన్‌కి జతకలుపుతున్నారు. అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతారన్నది పచ్చ వ్యూహం. మొదటి మీటింగ్‌లోనే మొత్తం తెలుగు వాళ్ళకు మహా ప్రయోజనం చేకూర్చడానికి ఇద్దరు యుద్ధవీరులు కలిశారు అన్న కలరింగ్ ఇవ్వడానికి మాత్రం గొప్పగా ప్రయత్నం చేశారు. కాకపోతే మేథావిలా కనిపించడానికి ప్రయత్నించే జెపి మొదటి రోజే తన అసలు రంగు కూడా చూపించేశాడు. ఈ బ్యాచ్ అసలు రంగులు ఏంటంటే……..?

…..రిటైరయ్యాక పాలిటిక్స్‌లోకి రావడం ఒకే గానీ సినిమాలు చేస్తూ ఉన్నప్పుడే చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ చాలా నష్టపోయాడు, పోరాటం చేస్తున్నాడు అని జెపి చెప్పుకొచ్చాడు.

పచ్చ సిద్ధాంతాలు ఇలానే ఉంటాయి. అసలు జెపి తెలుగు నేలపైనే ఉన్నాడా? ప్రపంచంలో అక్కడ అలా జరిగింది…..ఇక్కడ ఇలా జరిగింది అనే చెప్పే ఈ మేథావి రాజకీయాల్లోకి వచ్చాక పవన్ ఏం నష్టపోయాడో చెప్పగలడా? 2014లో పవన్ జనసేన పార్టీని స్థాపించాడు. తెరవెనుక వ్యవహారాల ఏంటో తెలియదు కానీ టిడిపి, బిజెపిలకు మద్దతిచ్చాడు. ఆ తర్వాత నాలుగేళ్ళపాటు ఎన్టీఆర్, మహేష్, చరణ్‌లకంటే స్పీడ్‌గా సినిమాలు చేశాడు. పవన్ కెరీర్‌లోనే ఇంత స్పీడ్‌గా సినిమాలు చేసింది ఈ మూడేళ్ళలోనే. ఇక కెసీఆర్, చంద్రబాబు భజన చేసి తన సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంపు, షోల పెంపులాంటి ఎన్నో సానుకూల నిర్ణయాలు తెచ్చుకున్నాడు. పూనం కౌర్‌లాంటి తన మనుషులకు బ్రాండ్ అంబాసిడర్ పదవులు ఇప్పించుకున్నాడు. కంటికి కనిపిస్తున్నవి ఇవి. ఇక తెరవెనుక వ్యవహారాలు తెలియదు. కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలు ఇవైతే పవన్ కళ్యాణ్ త్యాగాలు చేశాడు, పోరాటం చేస్తున్నాడు లాంటి సోది కబుర్లు చెప్పి జయప్రకాష్ నారాయణ ఆత్మవంచన ఎందుకు చేసుకుంటున్నట్టు?

ఇక మాటతప్పకూడదు, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అంటూ చాలానే మాటలు మాట్లాడాడు జెపీ. మరి ఇవే విషయాలు చంద్రబాబుకు వర్తించవా? బాబు ఇచ్చిన హామీలు ఎన్ని? నెరవేర్చినవి ఎన్ని? అయినా జెపి గురించి కొత్తగా తెలియనిది ఎవరికి? పదే పదే అబద్ధాలు చెప్తూ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తూ ఉండే చంద్రబాబులాగే పచ్చ మీడియా కూడా జెపిని మేథావి అని, ఇంకొకటని చెప్పి ప్రజలను నమ్మిస్తూ ఉంటుంది. అందరూ కలిసి స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకుంటూ ఉంటారు. తెలివితేటలు, మేథావితనం విషయం పక్కన పెడితే కంటికి కనిపిస్తున్న నిజాలను కూడా పట్టించుకోకుండా స్వార్థ రాజకీయాలు, కుట్ర రాజకీయాలకు అనుకూలంగా మాట్లాడతాం అంటే అలాంటి వాళ్ళను ఏమనాలి? ఇదే పచ్చ బ్యాచ్ అంతా ఆరడుగుల బుల్లెట్ అని ఆ మధ్య సమైక్యాంధ్ర టైంలో అశోక్ బాబు అన్న హీరోని పుట్టించారు. ఆ హీరో సీమాంద్రుల పుట్టిని పూర్తిగా ముంచేసి ఎంచక్కా బాబు పంచన చేరి టిడిపి అధికారంలోకి రావడినికి సహకరించాడు. పనయిపోగానే పూర్తిగా సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఇక 2019 కోసం ఇప్పుడు ఇద్దరు ఆరడుగుల బుల్లెట్‌లను సీమాంధ్ర ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది పచ్చ బ్యాచ్. ఈ ఇద్దరినీ కూడా అశోక్ బాబును నమ్మినట్టే నమ్మారంటే మాత్రం ఆల్రెడీ 2014 తర్వాత నుంచీ దేశం మొత్తం కూడా సీమాంద్ర ప్రజలను జాలిగా చూస్తున్నారు. 2019లో కూడా ఇలాంటి జిమ్మిక్కులను, కుట్రలను నమ్మి ఓట్లేశారంటే మాత్రం….ఆ తర్వాత సీమాంధ్ర ప్రజల అమాయకత్వం దేశం మొత్తం చర్చనీయాంశం అవుతుందనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -