ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.. ప్రతి పక్ష పార్టీ అయిన వైసీపీ శ్రేణులపై ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలకు తమపై ఆరోపణలు చేయడం అలవాటుగా మార్చుకున్నారని అన్నారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైజాగ్ లో వెలుగులోకి వచ్చిన భూకుంభకోణాల్లో తన పాత్ర ఉందని..తమ పార్టీకి చెందిన నేతల పాత్ర ఉంది అని ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు అని అన్నారు. తమపై చేస్తున్న్ ఆరోపణలలో ఎంత వరకు నిజం ఉందో నిరుపించాలని.. వైసీపీ శ్రేనులకు లోకేష్ బాబు సవాల్ విసిరారు. వారి దగ్గర ఖచ్చితమైన అధారాలు కనుక ఉంటే.. దర్యాప్తు చేస్తున్న సంస్థకు అప్పజెప్పాలని ఆయన సలహా ఇచ్చారు. ఇక ఇండ్ల నిర్మాణాలపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల గురించి లోకేష్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంకి లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశాలు కూడా జరిగాయని ఆయన అన్నారు.
ఏమైన అనుమానాలు ఉన్నాయంటే.. క్షేత్రస్థాయిలో పరిశీలనకు తీసుకెళ్ళెందుకు రెడీ అన్బి ఆయన అన్నారు. అయితే ఇంతవరకు పది వేల ఇళ్ల నిర్నానాలే కూడా జరగలేదని ప్రతి పక్ష నేతలు ఆరోపిస్తుంటే.. లోకేష్ మాత్రం ఇలా అనడంలో ఆయనకు ఇంతవరకు ఎన్ని ఇండ్లు కంప్లీట్ అయ్యాయో కూడా తెలియని స్థాయిలో ఉన్నారని వైసీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నారు.