Friday, May 9, 2025
- Advertisement -

జ‌న‌సేనుడిపై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టిన జేపీ..

- Advertisement -

విభ‌జ‌న స త‌ర్వాత ఏపీకీ రావాల్సిన హామీలు, ప్ర‌త్యేక‌హోదా, నిధుల విష‌యంలో రాజ‌కీయ‌పార్టీలు పోరాటం చేస్తున్నాయి. 2014లో భాజాపా,టీడీపీకి మ‌ద్ద‌తిచ్చిన ప‌వ‌న్ త‌ర్వాత యూట‌ర్న్ తీసుకున్నారు. ఇరు పార్టీల‌పై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. త‌ర్వాత కేంద్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నినిధులు ఇచ్చిందో తెలుసుకోడానికి ప‌వ‌న్ జేఎఫ్‌సీ (సంయుక్త నిజనిర్ధారణ కమిటీ) ని వేశారు. ఈ క‌మిటీలో జేపీ, ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌, మాజీ జ‌స్టిస్ గోపాల‌గౌడ త‌దిత‌రులు స‌భ్యులుగా ఉన్నారు.

ఈ క‌మిటీ ఓ రిపోర్ట్‌ను ప‌వ‌న్‌కు ఇచ్చిది. క‌మిటీలో కీల‌క పాత్ర పోషింన జేపీ ప‌వ‌న్‌కు షాక్ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి హోదా వచ్చే అవకాశమే లేదని, ఈ విషయం అన్ని రాజకీయ పార్టీలకు తెలుసని బాంబ్ పేల్చారు. పేరు ఏదైనా కావచ్చు కానీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ రావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చట్టపరంగానూ, పార్లమెంటులోనూ ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు నెరవేర్చిందో తేల్చడం కోసం జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో స్వతంత్ర నిపుణుల బృందం ఏర్పాటై ఈ రోజు తొలి సమావేశం నిర్వహించింది.

ప‌వ‌న్‌, జేఎఫ్‌సీ పై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు జేపీ. పవన్ కల్యాణ్ మొదట శ్రద్ధ చూపించి తరువాత పట్టించుకోవడం లేదని అన్నారు. జేఎఫ్‌సీ నివేదిక ఇచ్చిన తరువాత దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అందుకే తాను స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేశానని తెలిపారు. జేఎఫ్‌సీ తొలిదశ అయితే స్వతంత్ర నిపుణుల కమిటీ రెండో దశ అని వ్యాఖ్యానించారు. తాము చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సమయం ఇస్తే వెళ్లి కలుస్తామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -