విశాఖపట్నం జిల్లాలో మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. ఈ నియోజకవర్గం టీడీపీకి ఒక ప్రత్యేక దృష్టి ఉంది. టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. బోడి ముత్యాల నాయుడు మాడుగుల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఇప్పుడు ఈ స్థానంపై చంద్రబాబు నాయుడు, టీడీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ స్థానంలో వచ్చే ఎన్నికల్లో ఓ యువకుడిని దించాలని చూస్తోందంట. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలతో ప్రజా జీవనంలో ఉన్న ఎన్నారై పైలా ప్రసాద్ ఈ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యాడు.
వ్యవసాయం ఆధారిత జీవనం ఎక్కువగా ఉన్న మాడుగుల నియోజకవర్గంలో వనరులు పుష్కలం గా ఉన్నాయి. అమెరికాలో సాఫ్ట్‌వేర్ రంగంలో అత్యున్నత స్థానంలో ఉద్యోగం చేస్తున్న పైలా ప్రసాద్ మాతృభూమి మీద ఉన్న ప్రేమతో యువత ఉపాధి లక్ష్యముగా వివిధ కంపెనీలు ప్రారంభించాడు. స్థానిక యువతకు 100 మందికి ఉపాధి అవకాశాలను కల్పించారు. ప్రజా సేవలో దూసుకెళ్తున్నాడు. విద్య, వైద్య రంగాలలో తన వంతు సేవ అందించడం కోసం పైలా ఫౌండేషన్ ని స్థాపించి విశేష సేవలు అందిస్తున్నాడు. ప్రధాని మోదీ పిలుపు మేరకు మాడుగుల నియోజక వర్గంలో పలు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాల్లో స్వచ్ఛత మరియు పలురకాల కార్యక్రమాలు చేపట్టారు.
ఈ ఏడాది ముక్ష్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అమెరికా పర్యటనలో వివిధ రంగాలలో ఉన్న పారిశ్రామిక వేత్తలను సమన్వయ పరుస్తూ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడంలో కృషి చేశారు. అమెరికాలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమం విజయం కోసం తన వంతు కృషి చేస్తూ అందరి మన్నలు పొందారు. ఈ నేపథ్యంలో మాడుగుల నియోజకవర్గ టికెట్ పైలా ప్రసాద్‌కు ఇచ్చేలా ఓ నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే గెలుపు గుర్రాల వేటలో పడ్డ చంద్రబాబు మాడుగుల నియోజకవర్గానికి పైలాను ఓకే చేశారని సమాచారం.
దానికనుగుణంగా పైలా ప్రసాద్ ఇప్పటి నుంచే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నాడు. మాడుగుల రూపు రేఖలను మార్చాలనే లక్ష్యంతో క్రియాశీల రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు . యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే శిక్షణ కేంద్రాలు, చిన్న చిన్న పరిశ్రమల ఏర్పాటు, విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో అధివృద్ధి, మౌలిక వసతులు కల్పన లక్ష్యంగా యువతను చైతన్య పరుస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇక ఎన్నికల సమయంలో పైలా ప్రసాద్‌కు టికెట్ ఖాయం చేసే అవకాశం మెండుగా ఉంది.