ఆరకు ఎమ్మెల్యే కిడారి, సోమా హత్యతోదంతం పై మావోల పేరిట లేఖ విడుదలైంది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ పేరుతో వచ్చిన లేఖలో గిరిజన ద్రోహానికి పాల్పడుతున్నందుకే వారిని ప్రజాకోర్టులో శిక్ష విధించామని పేర్కొన్నారు. ఈ లేఖ ఇప్పుడు మన్యంలో కలకలం రేపుతోంది.
గూడ క్వారీ విషయంలో ఆయనను ఎన్నో సార్లు హెచ్చరించాం..అయినా పద్దతి మార్చుకోలేదన్నారు మావోలు. పోలీసులకు మాకు ఎలాంటి శతృత్వం లేదన్నారు. అందుకే ఆయుధాలతో దొరికినా పోలీసులకు ఎటువంటి హాని చేయలేదన్నారు. వారిద్దరూ గిరిజన వ్యతిరేకులని, ప్రజా ద్రోహులని అందుకే వారిని చంపేసినట్టు అందులో పేర్కొన్నారు.
మరోవైపు పాడేరు ఫిరాయిపుం ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి స్ట్రాంగ్ వార్నింగ్ లేఖలో ఇచ్చారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని, పద్ధతి మార్చుకోకపోతే కిడారి, సోమకు పట్టిన గతే ఆమెకు పడుతుందని లేఖలో హెచ్చరించారు.
అధికార పార్టీకి 20 కోట్లకు అమ్ముడుపోయిందని ఆరోపించారు . కిడారి.. ఈశ్వరీకి సంబంధించిన అన్ని విషయాలు చెప్సారన్నారు. ఆమె తీసుకున్న డబ్బుల్ని రెండునెలల్లో గిరిజనులకు పంచిపెట్టాలని హెచ్చరించారు. లేకుంటే నిన్ను కూడా లేపేస్తామని హెచ్చారించారు.
అయితే ఈ లేఖపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మావోలు ఉపయోగించే భాష.. కాగితాలు భిన్నంగా ఉంటాయి. కానీ ఈసారి మావోలు విడుదల చేసే లేఖలో అనేక మార్పులున్నాయి. దీంతో ఇవి నిజంగా మావోయిస్టులే విడుదల చేశారా లేక.. వేరేవాళ్లు విడదుల చేసి మావోల పేరు వాడుతున్నారన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.