Monday, April 29, 2024
- Advertisement -

అరకులో ఘోర రోడ్డు ప్రమాదం…!

- Advertisement -

విశాఖ జిల్లా అరకు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  విశాఖ అరుకు బస్సు ప్రమాదానికి గురైన బాధితులంతా హైదరాబాద్ నగరానికి చెందిన షేక్ పేట్ సీతానగర్‌కు చెందిన వారని స్థానిక అధికారులు గుర్తించారు. విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలం వద్ద శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డముకు 5 వ నంబర్ మలుపు వద్ద టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. బస్సులో 27 మంది ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నలుగురు మృతి చెందగా మరో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

చనిపోయినవారి కొట్టం సత్యనారాయణ, కె.సరిత,ఎన్.లలిత మరో చిన్నారి శ్రీనిత్య. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. అయితే డ్రైవర్ మాత్రం బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని అంటున్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఏపీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు వెంటనే మెరుగైన చికిత్సను అందించాలని సంబంధిత అధికారులకు గవర్నర్ సూచించారు. అరకు ఘటనపై వెంటనే స్పందించిన సీఎం జగన్ చనిపోయిన వారికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి వెంటనే మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటన గురించి తెలుసుకున్న సీఎం కేసీఆర్ తన సానుభూతి ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అరకు ఘాట్ రోడ్డులో జరిగిన విషాద ఘటన కలచివేసిందని పేర్కొన్నారు.

ఎంతో విలువైన ప్రాణాలు కోల్పోవడం, తీవ్రంగా గాయపడిన సంఘటన చాలా దురదృష్టకరమని, బాధాకరమని అన్నారు. ఘటన సమాచారం తెలియగానే రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ తన సిబ్బందిని బాధిత కుటుంబం వద్దకు వెళ్ళి సమాచారం అందించారు. 

బాధిత కుటుంబ సభ్యులకు పవన్, సోము వీర్రాజు,లోకేష్ బాబు,ఎంపి రమేష్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పలువురు రాజకీయ నేతలు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్, సికింద్రాబాద్, ఆర్డీవో వసంతకుమారి, షేక్ పేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి కూడా శనివారం ఉదయం 5 గంటలకు వైజాగ్ వెళ్లనున్నారు.

గుత్తిలో రూ.4.28 కోట్లతో నిర్మాణం.. హరీష్ రావు ముచ్చట..!

తమిళనాడులో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 11మంది మృతి.. 22మందికి తీవ్ర గాయాలు!

కడుపుబ్బా నవ్విస్తున్న ‘జాతిరత్నాలు’

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -