టీడీపీ.. అధికార బలం.. హడావిడి చేస్తోంది. అంతేకాదు.. ఇందు కోసం మీడియా కూడా ఓ రెంజ్ లో ప్రచారం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం రెండు సార్లు పర్యటించారు. అంతేకాకుండా కోట్లకు కోట్ల నిధులు కుమ్మరించారు. మతం ఓట్ల కోసం ముస్లిం నేతకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో టీడీపీ హడావిడి మాములుగా లేదు. అంతే కాదు.. మంత్రులు అందరూ పర్యటిస్తున్నారు. జనాలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ గెలుపు కంటే.. మంత్రి లోకేష్ ప్రచారంపైనే ఆ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది.
దాంతో టీడీపీ ఒక్క సీటు కోసం తెగ కష్టపడుతోంది. టీడీపీకి ఇద్ది పెద్ద సవాల్ గా మారింది. అయితే ఇది పక్కన పెడితే.. జనం మనసులో ఏం ఉందో అప్పుడే చెప్పలేం. టీడీపీ ఇలా చేస్తుంటే.. మరిప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే.. గ్రౌండ్ వర్క్ చేస్తుందంట. టీడీపీ లో కీ రోల్ లో ఉన్న లీడర్ ను లాగింది. అంతటితో ఆగకుండా.. హడావిడి చేయకుండా.. రోజూ జనంలోకే వెళ్లండి.. టీవీల్లో కనిపించాల్సిన అవసరం లేదు.. జనానికి కనిపిస్తే చాలు.. మన గెలుపు ఖాయం అని ప్లాన్ చేస్తున్నారట. ఆత్మప్రభోదానుసారం ఓటు వేయండి.
ఈ నియోజకవర్గం వైసీపీదే.. ఇప్పుడూ వైసీపీకే ఓటు వేద్దాం అని చెపుతున్నారట. టీడీపీకి ఓటు వేస్తే నమ్మకద్రోహానికి ఓటు వేసినట్లే అని.. ఓసారి బుద్ధి చెబితే మరోసారి ఇలాంటి తప్పు చేయరంటూ ప్రతి ఓటరును కలిసి ఓ రెండు నిమిషాలు మాట్లాడుతున్నారట. ఇటీవల టీడీపీ నేతల హడావిడి చూసి.. వీళ్లు ఏం చేస్తున్నారని ఆరా తీసిన అధికార పార్టీ నేతలకు వాళ్ల గ్రౌండ్ వర్క్ తెలిసి షాక్ అవుతున్నారట.