Saturday, May 3, 2025
- Advertisement -

నంద్యాల టీడీపీలో క‌ల‌క‌లం.. ఆడియే టేపు బ‌య‌ట‌కు

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక జోరుమీదున్న స‌మ‌యంలో అధికార పార్టీకి స‌మ‌స్య‌లు త‌ప్ప‌డంలేదు.అది కూడా సొంత పార్టీనేత‌ల వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు ఇప్పుడు నంద్యాల రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మార‌డంతో బాబుకు త‌ల నొప్పిగా మారాయి.తాజాగా భూమా నాగిరెడ్డి ముఖ్యనుచ‌రుడు సీనియ‌ర్ నేత బూతు పురాణం బ‌య‌ట‌కు పొక్క‌డంతో ఉప ఎన్నిక‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూప‌నుంది.
ఒక వ్యక్తిపై టీడీపీ నేతల దాడికి సంబంధించిన వీడియోను స్థానిక ముస్లిం నేత ఒకరు వాట్సాప్‌లో పోస్టు చేశారు. దీంతో రగిలిపోయిన ఏవీ సుబ్బారెడ్డి నేరుగా ముస్లిం నేతకు ఫోన్‌ చేసి బండబూతులు తిట్టారు. నేను ఎంత మంచి వాడినో అంత చెడ్డవాడిని అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. సభ్యసమాజం ఉచ్చరించలేని భాషను వాడారు సుబ్బారెడ్డి.ఈ ఆడియో టేపు బయటకు రావడంతో టీడీపీ నేతలు ఖంగుతిన్నారు.
ముస్లింలను దువ్వేందుకు పదవులు, ఇళ్లు ఎరవేస్తూ మంత్రులు, ముఖ్యమంత్రి కసరత్తులు చేస్తుంటే భూమా కుటుంబానికి ఆత్మ లాంటి ఏవీ సుబ్బారెడ్డి ఇలా ముస్లింలను దూషించడంతో దుమారం రేగింది. వెంటనే ఏవీ సుబ్బారెడ్డి క్షమాపణ చెప్పాలని మైనార్టీలు డిమాండ్ చేస్తున్నారు. ఏవీ సుబ్బారెడ్డిని ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.దీని ప్ర‌భావం ఉప ఎన్నిక‌మీద ప‌డ‌టంతో నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -