Wednesday, April 24, 2024
- Advertisement -

రాజగోపాల్ రెడ్డికి ఊహించని ట్విస్ట్ !

- Advertisement -

తెలంగాణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి అలాగే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తరువాత.. మునుగోడు చుట్టూ రాజకీయ వాతావరణం ఏస్థాయిలో వేడెక్కిందో అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ లో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కూ దూరమయ్యారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో ముసలం ఏర్పడింది. వరుసగా సీనియర్ నేతలంతా రేవంత్ నాయకత్వంపై వేలెత్తి చూపుతూ కాంగ్రెస్ కూ గుడ్ బై చెబుతున్నారు. ఇది ఒకింత కాంగ్రెస్ కూ పెద్ద దేబ్బే అని చెప్పవచ్చు. కాంగ్రెస్ ను విడిచిన వారంతా బీజేపీ గూటికి గూటికి చేరుతుండడం, పార్టీలో ఉన్నవారు కూడా రేవంత్ పై నిప్పులు చెరుగుతుడడంతో మునుగోడు కేంద్రంగా టి-కాంగ్రెస్ లో ఏర్పడ్డ ఈ అంతర్గత కుమ్ములాటలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి.

ఇదిలా ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కూ టాటా చెప్పిన తరువాత రేవంత్ రెడ్డి మరియు కోమటి రెడ్డి బ్రదర్స్ మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనెంతల వివాదం కొనసాగుతూ వస్తోంది. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు దూరమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరుపున బరిలోకి దిగనున్నారు. దాంతో కాంగ్రెస్ కు సిట్టింగ్ స్థానం అయిన మునుగోడు చేజారిపోకుండా కాంగ్రెస్ విశ్వ ప్రయత్నలే చేస్తోంది. అయినప్పటికి మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి చెక్ పెట్టె నేత కాంగ్రెస్ లో లేరనే వాదన బలంగానే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న నయా వ్యూహం తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తావిస్తోంది. ” రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లోకి వస్తే బి ఫామ్ ఇస్తామని, పార్టీ సీనియర్ నేతలందరం కలిసి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకుంటామని, ఆయన కోసం పని చేస్తామని ” రేవంత్ రెడ్డి యదాద్రి జిల్లా పాదయాత్రలో చెప్పుకొచ్చారు.

రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త పోలిటికల్ హిట్ ను పెంచుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తనకు అమ్మలాంటిదని, ఆ పార్టీ పైన తనకు ఎలాంటి సమస్యలు లేవని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు. కేవలం రేవంత్ రెడ్డిపై ఉన్న అసహనం కారణంగానే తను పార్టీ విడిచినట్లు రాజగోపాల్ రెడ్డి ఆ మద్య వ్యాఖ్యానించారు. దీంతో రేవంత్ రెడ్డే స్వయంగా రాజగోపాల్ రెడ్డిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించడంతో.. రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటదనేది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 21 అమిత్ షా సమక్షంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరానున్నారు. ఈ సమయంలోనే రేవంత్ రెడ్డి తిరిగి ఆహ్వానం పలకడం, రాజగోపాల్ రెడ్డి కోసం అందరం కలిసి పని చేస్తాం అని చెప్పడం, ఊహించని ట్విస్ట్ అనే చెప్పవచ్చు. మరి కాంగ్రెస్ ను అమితంగా ప్రేమించే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : విజయశాంతి నోరు కట్టేస్తున్న నేతలెవరూ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -