Friday, May 9, 2025
- Advertisement -

విఫ‌ల‌మ‌యిన టీడీపీ బుజ్జగింపులు….! వైపీపీలోకి మాజీ మంత్రి కుటుంబం…!!

- Advertisement -

2019 ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంపింగ్ లు ఎక్కువైపోయాయి. ఇన్నాల్లు టీడీపీలోకి ప్రారంభ‌మ‌యిన వ‌ల‌స‌ల‌కు బ్రేక్ ప‌డింది. చంద్ర‌బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ సీన్ రివ‌ర్స్ అయ్యింది. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు వ‌స్తున్న ప్ర‌జాస్పంద‌న‌ను చూసి పార్టీలోకి వ‌స‌లు ఊపందుకున్నాయి.

ఇటీవలే గుంటూరు, విజయవాడల్లో జగన్ పాదయాత్ర సందర్భంగా టీడీపీ నుంచి నేతలు వైసీపీలోకి చేరారు. జగన్ తో పార్టీ కండువాలు వేయించుకుని వీళ్లు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో నేత కూడా వైఎస్సార్సీపీ బాటపడుతున్నాడని తెలుస్తోంది.

తాజాగా నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కుటుకంబం అంతా వైసీపీ తీర్థం పుచ్చుకొనేందుకు సిద్ధ‌మ‌య్యింది. ఆయన మరెవరో కాదు.. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో గతంలో కీలకంగా వ్యవహరించి, గత ఎన్నికల అనంతరం రామనారాయణ రెడ్డి తన సోదరుడు వివేకానందరెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ తరఫున వీరికి ఎమ్మెల్సీ హామీ లభించినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అది జరగలేదు. ఒక దశలో రామనారాయణరెడ్డికి చంద్రబాబు మంత్రి పదవిని ఇవ్వనున్నారనే మాట కూడా వినిపించింది. చివ‌రికి మొండిచేయి చూప‌డంతో వైసీపీలో చేరేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు.

పార్టీ మారవద్దంటూ టీడీపీ చేసిన బుజ్జగింపులు కూడా ఫలించలేదనే వాదనలు వినపడుతున్నాయి. పార్టీ మారవద్దంటూ టీడీపీ చేసిన బుజ్జగింపులు కూడా ఫలించలేదనే వాదనలు వినపడుతున్నాయి. వచ్చే వారంలో ఆనం సోదరులు టీడీపీని వీడి వైసీపీలోకి అడుగుపెట్టనున్నారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటు విషయంపై కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఆత్మకూరు సీటు ఇస్తామని వైసీపీ ఆఫర్ చేస్తుండగా.. వెంకటగిరి సీటు కావాలని ఆనం కోరినట్లు టాక్ వినిపిస్తోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవలే ఆనం వివేకానందరెడ్డిని పరామర్శించడానికి వెళ్లినప్పుడు కూడా అక్కడ నుంచి రామనారాయణ రెడ్డి వెళ్లిపోయారని, తన కార్యాలయం నుంచి కూడా చంద్రబాబు ఫొటోలను ఆయన తీసేయించారని… వైసీపీలోకి ఈయన చేరిపోవడం ఇక లాంఛనమే అని ప్రచారం సాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -