జాతీయస్థాయి సర్వేల నుంచీ రాష్ట్ర స్థాయి సర్వేల వరకూ కూడా 2019 ఎన్నికల ఫలితాలపై సర్వేలు చేస్తూ ఉన్నాయి. ఇంతకుముందు వచ్చిన అన్ని సర్వే ఫలితాల్లోనూ 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ఘన విజయం ఖాయమనే తేలింది. ఇప్పుడు నెటిజనుల అభిప్రాయాలను ఆన్లైన్లోొ తీసుకుంటూ ప్రముఖ తెలుగు వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలోనూ జగన్‌దే గెలుపని తేలింది.
ఆన్లైన్ పోల్‌లో ట్రాన్స్పరెంట్గా నిర్వహించిన ఈ సర్వేలో 2019 ఎన్నికల తర్వాత జగనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని 40. 33 శాతం మంది నెటిజనులు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడికి 33.74 శాతం మంది మద్దతిచ్చారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని 25.92 శాతం మంది అభిప్రాయపడ్డారు. మొత్తంగా చూస్తే సమీప ప్రత్యర్థి చంద్రబాబుకంటే జగన్‌కి ఏడు శాతం ఆధిక్యత ఈ సర్వేలో కనిపించింది. ఏప్రిల్ నెలలోనే జరిపిన ఈ సర్వే ఫలితాల్లో వాస్తవికత అయితే కనిపిస్తోందని క్రిటిక్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పటికీ అన్ని విషయాల్లోనూ జగన్ ఆలోచించినంత పరిణతితో చంద్రబాబు ఆలోచించలేకపోతూ ఉండడం……అవినీతి వ్యవహారాలు…..అబద్ధాల రాజకీయాలపై ప్రజలు విసుగెత్తి ఉన్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడూ లేని స్థాయిలో ఎక్కువ రోజుల ప్రజల మధ్యనే ఉండడం…..రుణమాఫీలు, హోదాతో సహా అన్ని విషయాల్లోనూ జగన్ చెప్పినవన్నీ నిజాలు కావడం…..అత్యంత అనుభవజ్ఙుడైన చంద్రబాబు కంటే జగనే ఎక్కువ పరిణతితో ఆలోచిస్తూ ఉండడంలాంటి అంశాలు జగన్‌కి ప్లస్ అయ్యాయని చెప్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్న కొద్దీ వస్తున్న సర్వే ఫలితాలన్నీ కూడా 2019 ఎన్నికల తర్వాత వైకాపాదే గెలుపు…..ఆంధ్రప్రదేశ్‌కి కాబోయే ముఖ్యమంత్రి జగనే అని చెప్తూ ఉండడం మాత్రం టిడిపి శ్రేణుల్లోనూ, నాయకుల్లోనూ పూర్తిగా నైరాశ్యం నెలకొనేలా చేస్తోంది. మరోవైపు వైకాపా శ్రేణులు మాత్రం ఈ సర్వే ఫలితాలతో పాటు జగన్ ప్రజా సంకల్పయాత్ర కూడా భారీ స్థాయిలో విజయవంతం అవుతూ ఉండడంతో పూర్తి ఉత్సాహంగా ఉన్నారు.