Tuesday, May 7, 2024
- Advertisement -

క్రిస్ గేల్ వీర‌విహారం ముందు ధోనీ ధ‌మాకా స‌రిపోలేదు….

- Advertisement -

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సొంత మైదానంలో వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను 4 పరుగుల తేడాతో ఓడించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో చెన్నైను ఓడించింది. 24 బంతుల్లో 67 పరుగులు అవసరమైన దశలో.. నడుం నొప్పితో బాధపడుతూనే ధోనీ (44 బంతుల్లో 79 నాటౌట్) దూకుడుగా ఆడినప్పటికీ.. లాస్ట్ ఓవర్ థ్రిల్లర్‌లో పంజాబ్‌నే విజయం వరించింది. చివరి ఓవర్లో చెన్నై విజయానికి 17 పరుగులు అవసరం కాగా.. మోహిత్ శర్మ అద్భుతంగా బంతులేశాడు. ధోనీకి అందకుండా బంతులేసి 11 పరుగులే ఇవ్వడంతో చెన్నై 193/5కే పరిమితమైంది.

క్రిస్ గేల్ దుమ్ము దుమారం ముందు మహేంద్ర సింగ్ ధోనీ దూకుడు సరిపోలేదు. 38 ఏళ్ల వయసులో ఇక క్రికెట్ లో అంతగా రాణించలేడేమోనని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం పక్కనబెట్టిన క్రిస్ గేల్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే తానంటే ఏంటో చూపించాడు.

గత రాత్రి జరిగిన మ్యాచ్ లో 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులతో విరుచుకుపడి 63 పరుగులు చేసి, తన జట్టుకు శుభారంభాన్ని అందించగా, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 197 పరుగులు చేసింది. తొలి వంద పరుగులను 10 ఓవర్లలోపే సాధించిన ఆ జట్టు మరింత భారీ స్కోరు చేయకుండా చెన్నై బౌలర్లు కట్టడి చేశారు. ఆపై 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టులో ఓపెనర్ రాయుడు చేసిన 49 పరుగులు మినహా టాప్ ఆర్డర్ రాణించలేకపోయింది. ఆ సమయంలో బరిలోకి దిగిన ధోనీ 44 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో విజృంభించి 79 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచినప్పటికీ, జట్టు విజయతీరాలను చేరలేకపోయింది.

22 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న గేల్ (33 బంతుల్లో 63; 7×4, 4×6) వాట్సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మయాంక్ అగర్వాల్ (19 బంతుల్లో 30), యువీ (13 బంతుల్లో 20) దూకుడుగా ఆడారు. కానీ చివరి ఆరు ఓవర్లలో ఆ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 48 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పంజాబ్ 197/7కే పరిమితమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -