తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు పార్టీలు సిద్దమవుతుంటే తాజాగా మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ఇలా ఇవాళ ఓ కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం జరిగింది. “యువ తెలంగాణ” పార్టీ పేరుతో ఈ కొత్త రాజకీయ పార్టీ రానున్న ఎన్నికల్లో పోటీకి దిగడానికి సిద్దమైంది. ట్టా బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమలు ఈ కొత్త పార్టీని స్థాపించారు.
యువత, మహిళలకు రాజకీయ అవకాశాన్ని కల్పించడమే తమ పార్టీ ద్యేయమని పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణ. అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వంలో మహిళకు, యువతకు ప్రాధాన్యతే ఇవ్వడం లేదంటూ విమర్శించారు. అసలు కేబినెట్ లోకి ఒక్క మహిళా మంత్రిని కూడా తీసుకోకుండా వారిని అవమానించారన్నారు. అందుకోసమే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాణి రుద్రమను నియమించినట్లు తెలిపారు. పార్టీ కమిటీలో కూడా మహిళలకు స్థానం కల్పించినట్లు జిట్టా బాలకృష్ణారెడ్డి తెలిపారు
రాణి రుద్రమ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వంలో మహిళలకు అవకాశాలు లేకుండా పోయాయన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. యువ తెలంగాణ పార్టీలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.