టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకుల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తుండగా చంద్రబాబుపై మరో పిటిషన్ దాఖలు చేసింది సీఐడీ. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబును ప్రశ్నించేందుకు 5 రోజుల కస్టడీకి అనుమతి కోరింది సీఐడీ. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో పీటీ వారెంట్ కూడా దాఖలు చేసింది. దీంతో న్యాయపరంగా చంద్రబాబు ముందున్న దారులన్ని మూసుకుపోయాయి.
బాబు బెయిల్ కోసం న్యాయవాదులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న రోజురోజుకు బాబు పరిస్థితి సంక్లిష్టంగా మారుతోంది. న్యాయస్ధానం పీటీ వారెంట్ ఇస్తే బెయిల్ వచ్చే ప్రశ్నే లేదు. ఇక ఇదే సమయంలో విదేశీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్నారు సీఎం జగన్.
ఇక ఆర్ధికనేరం కేసులో బెయిల్ రావడం అంత సులభంకాదు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే సీఐడీ ప్రతి ఆధారాన్ని పక్కాగా సేకరించి కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో బాబుకు ఇప్పట్లో బెయిల్ దొరకడం కష్టమనే వాదన వినిపిస్తోంది. ఒక వేళ బెయిల్ దొరికినా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది.
ఈ కేసులో . ఏ-1గా చంద్రబాబు, ఏ-2గా నారాయణ, ఏ-3గా లింగమనేని రమేశ్, ఏ-4 లింగమనేని రాజశేఖర్, ఏ-5గా అంజనీ కుమార్, ఏ-6గా లోకేశ్‌లపై కేసు నమోదు చేసింది. దీంతో చంద్రబాబుకు బెయిల్ దొరకడం సాధ్యంకాదని పలువురు న్యాయనిపుణులు అభిప్రాయడపతున్నారు.