టీడీపీకీ మ‌రో షాక్‌… పార్టీకి రాజీనామా చేసిన గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే

టీడీపీ అభ్య‌ర్తుల జాబితా పార్టీలో చిచ్చురేపుతోంది. టికెట్లు ద‌క్క‌ని సిట్టింగ్ ఎమ్మెల్యేలు బాబు షాక్ ఇస్తున్నారు. తాజాగా మ‌రో కృష్ణాజిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పార్టీకి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన పులివర్తి… వైసీపీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబుపై 13,505 మెజార్టీతో గెలుపొందారు.

అయితే ఈసారి ఎన్నిక‌ల్లో గన్నవరం ఎమ్మెల్యే టికెట్ నేలపూడి స్టాలిన్‌బాబుకు ఇవ్వడంతో అసంతృప్తికి లోనైన ఆయన రాజీనామా చేసి బాబుకు షాక్ ఇచ్చారు. తనను కాదని టికెట్‌ ఇచ్చిన నేలపూడి స్టాలిన్ బాబుని ఓడించడమే తన టార్గెట్ అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు ప్రకటించారు పులపర్తి నారాయణమూర్తి.