ఎన్నికల నేపధ్యంలో వైసీపీ, టీడీపీ పార్టీల్లో జంపింగ్ జిలానీలు పెరిగిపోతున్నారు. టికెట్ రాని వారు, అసంతృప్తిగా ఉన్న వారు పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటి వరకు టీడీపీనుంచి వైసీపీలోకి ఎక్కువ మంది నేతలు ఫిరాయించారు. అయితే ఇప్పుడు వైసీపీనుంచి కూడా నేతలు జంప్ చేసేందుకు సిద్దమవుతున్నారు.పర్టీని మారుతున్న
కర్నూలు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.టికెట్ల విషయంలో నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో తమకు టికెట్ రాదని ముందుగానే తమ భవిష్యత్తు కోసం తమ దారి తాము చూసుకొనేందుకు సిద్దమవతున్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం నాయకుల మధ్య ఆధిపత్య పోరే.
కాటసాని రాంభూపాల్‌రెడ్డి వైసీపీలో చేరిన తర్వాత తమకు జగన్ ప్రాధాన్యత తగ్గించారని గౌరు దంపతులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. టికెట్ ఇచ్చే విషయంలోకూడా జగన్నుంచి హామీ రాలేదన్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఈ సారి టికెట్ నాకేనని కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ మారేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
రెండు మూడు రోజుల్లో కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సమాచారం. వచ్చే నెల 6న టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో ఈ పరిణామం వైసీపీని షాక్‌కు గురిచేసింది. ఇప్పటికే బలమైన నేతలందరూ టీడీపీలోకి ఫిరాయించారు. గౌరు చరిత కూడా పార్టీని వీడితే అది వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి.