Friday, May 9, 2025
- Advertisement -

ఎట్టకేలకు స్పందించిన చంద్రబాబు దత్తపుత్రుడు!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు జనసేన అధినేత,సినీ నటుడు పవన్ కళ్యాణ్. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని వ్యాఖ్యానించారు.ఆధారాలు చూపకూండా ఎలా అరెస్ట్ చేస్తారని…ఈ విషయంలో చంద్రబాబకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా చంద్రబాబు అవినీతిపై మాత్రం పవన్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విశేషం.

ఇక చంద్రబాబుకు ఐటీ నోటీసులు, అమరావతి నిర్మాణంలో జరిగిన అక్రమాలపై కొద్దిరోజులుగా ప్రజల్లో తీవ్ర చర్చజరుగుతోంది. చంద్రబాబును అరెస్ట్ చేస్తారని ప్రచారం కూడా జరిగింది. ఇదే విషయాన్ని స్వయంగా చంద్రబాబే వెల్లడించారు. అయితే దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు పవన్‌ కళ్యాణ్‌. వైసీపీ నేతలు సైతం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు అవినీతిపై పవన్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఈ ఎపిసోడ్ మొత్తం వారం రోజులుగా జరుగుతున్న పవన్ నుండి కానీ జనసేన నుండి కానీ ఒక్క ప్రకటన చంద్రబాబుకు వ్యతిరేకంగా వెలువడలేదు.

ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే పవన్..ప్రజాధనం ఎవరు దుర్వినియోగం చేసినా తప్పే, అవినీతికి పాల్పడిన వారిని శిక్షించాలని ఒక్క స్టేట్‌మెంట్ ఇచ్చినా బాగుండేది. కానీ ఎన్ని విమర్శలు వచ్చిన పవన్‌ నుండి ఉలుకు పలుకు లేదు. కానీ తాజాగా సీఐడీ పోలీసులు చంద్రబాబు పాత్ర ఉందని తేల్చిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేస్తే ఇది అక్రమమని వెంటనే ముందుకొచ్చారు పవన్‌. దీంతో వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా ఈ వ్యవహారంలో పవన్ పాత్ర ఉందా అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే తప్పేముందని ప్రశ్నిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -