జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్నూలులోని ఆలూరు మండలం హత్తిబెళగల్ క్వారీ పేలుడు ప్రాంతాన్ని సోమవారం పరిశీలించారు. పేలుడు ఘటనకు సంబంధించి వివరాలను పవన్ స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ వద్ద క్వారీలో జరిగిన పేలుడు ప్రమాదంలో బాధితులను పవన్ ఇవాళ పరామర్శించారు. తొలుత ప్రమాదానికి కారణమైన హత్తిబెళగల్‌కు వెళ్లి క్వారీని పరిశీలించారు.. అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
హత్తిబెళగల్ క్వారీ పేలుడు ఘటన దురదృష్టకరమని, సీఎం చంద్రబాబు ప్రజాసమస్యలను విస్మరించకూడదని సూచించారు.ఏపీలో ఇప్పటికైనా అక్రమ మైనింగ్ ను ఆపాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అక్రమ మైనింగ్ జరుగుతోందని, గనుల శాఖ మంత్రి, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
కర్నూలు జిల్లాలో 1600 క్వారీలకు అనుమతులు ఇచ్చారని, 600కి పైగా అక్రమ క్వారీలు నడుస్తున్నాయని, స్థానిక యువకులు కొన్ని సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చారని, ఆ సమస్యలపై త్వరలోనే స్పందిస్తానని చెప్పారు. స్థానిక యువకులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై త్వరలోనే స్పందిస్తానని హామీ ఇచ్చారు.