జనసేన అధినేత పవన్ సహనం కోల్పోతున్నారా….? అర్థం, పర్థంలేని ఆరోపణలు చేయడం అందరిలోనూ నవ్వులపాలవుతున్నారు. అధికార పార్టీనీ వదిలి ప్రతిపక్ష పార్టీపైన చేస్తున్న విమర్శలే అందుకు నిదర్శం. గోదావరి జిల్లాల్లో కొనసాగిస్తున్ పవన్ తన పోరాట యాత్రలో జగన్నే టార్గెట్‌గా చేసుకొని ఆరోపణలు చేస్తున్నారు.
ఎక్కడైనా ప్రతిపక్షాలు అధికార పార్టీపై పోరాటాలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రతిపక్షం…మరో ప్రతిపక్షం మీద ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. ఈ మధ్యన జగన్‌మీద పవన్ విమర్శలు చేయడం అలవాటుగా మారింది. పవన్ చేస్తున్న ఆరోపణల్లో సంబద్ధత ఎంత? అనేది చిన్న పిల్లాడిని అడిగినా తెలుస్తుంది.
నాలుగుసంవత్సరాల పాటు టీడీపీతో అంటకాగిన పవన్ తర్వాత పక్కు వచ్చి తూతూమంత్రంగా బాబు, లోకేష్‌లపై విమర్శలు చేశారు. తర్వాత ఏమైందోగాని ప్రతిపక్షనేత అయిన జగన్ మీద పడ్డాడు. ప్రజా సమస్యలపై జగన్ పోరాడుతుంటే ఆయనమీద విమర్శలు చేయడం ఏంటో పవన్‌కే తెలియాలి.
గతంలో ఇసుమమాఫియా, భూకుంభకోణం సమయంలో చంద్రబాబు మీద కాగ్ అక్షింతలు వేసిన సందర్భంలో అయినా.. మరే సందర్భంలో అయినా.. పవన్ వచ్చిందల్లా బాబు గ్రాఫ్ పడిపోతూ ఉన్నప్పుడే. పవన్ కల్యాణ్ అప్పట్లో ఎక్కడ పర్యటించాలన్నా.. అక్కడ తెలుగుదేశం నేతలే ముందస్తుగా ఏర్పాట్లు చేస్తూ వచ్చారు.
రెండు రోజులుగా జగన్ మగతనం, ధైర్యం , కులం గురించి ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నా జగన్ వాటన్నింటినీ పట్టించుకోవడంలేదు. గతంలో తన మీద పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన జగన్ ఇప్పుడు మాత్రం అసలు స్పందించడంలేదు. అందుకే పవన్ నిరాశలో ఉన్నారు. జగన్‌ను విమర్శించి పాపులారిటీ సంపాదించుకోవాలని చూస్తున్న పవన్ ఆశలు నెరవేరడంలేదు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబుతోనే జగన్ కు బంధం కట్టేశాడు పవన్. ఇప్పుడైనా జగన్ స్పందిస్తాడేమో అనేది పవన్ ఆశగా కనిపిస్తోంది.