పవన్ పై ఇంత కక్ష ఎందుకు ?

PawanKalyan Varahi Vehicle Controversy
PawanKalyan Varahi Vehicle Controversy

ఏపీలో ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది. అయినప్పటికి ఇప్పటి నుంచే ఎన్నికల హీట్ పెంచుతున్నాయి రాజకీయ పార్టీలు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ఇప్పటి నుంచే ఎన్నికల మూడ్ లోకి వెళ్ళాయి. ఓ వైపు పార్టీలో సంపూర్ణ మార్పులు, అధికారుల బదలీలు.. సరికొత్త నిర్ణయాలతో సి‌ఎం జగన్ వైసీపీని ఎన్నికలకు సంసిద్దం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిత్యం ప్రజల్లో ఉంటూ పోలిటికల్ హీట్ ను పెంచుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా ? అనే సందేహాలు రాక మానవు.

ఇదిలా ఉంచితే గత కొన్నాళ్లుగా ఏపీలో వైసీపీ వర్సస్ జనసేన మద్య రాజకీయ వివాదం కొనసాగుతోంది. ఇరు పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటూ పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఇక పవన్ ప్రచార రథం ” వారాహి ” పై రాజకీయ రగడ కొనసాగుతోంది. పవన్ తన ప్రచార రథానికి నిషేధిత రంగు వేసుకున్నారని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆలివ్ గ్రీన్ రంగు మిలటరీ కి మాత్రమే కేటాయించినది అని, ఆ రంగును ఇతర వాహనాలకు వేసుకోవడం చట్ట విరుద్దం అని వైసీపీ నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతల విమర్శలకు పవన్ ట్విట్టర్ లో గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

” తొలుత తన సినిమాలు ఆపేశారని, ఆ తరువాత విశాఖలో అడ్డగించరాని, నగర నుంచి వెళ్లిపోయెందుకు అడుగడుగున ఆటంకాలు సృష్టించారని, ట్విట్టర్ లో రాసుకొచ్చారు పవన్. ఇప్పుడేమో వాహనం రంగుపై రాద్దాంతం చేస్తున్నారని వాపోయారు పవన్. తాను ఊపిరి పీల్చుకోవడం ఆపేయాలా చెప్పండి అంటూ పవన్ ట్విట్టర్ లో ప్రశ్నించారు. ఇక జనసేన వ్యవహారాల ఇన్ చార్జ్ నాదెండ్ల మనోహర్ కూడా వైసీపీ విమర్శలపై కాస్త ఘాటుగానే మండి పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాకు, పార్టీ రంగులు వేసే మీరు.. మా వారాహి రంగు రంగు గురించి విమర్శించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అయితే ఆలివ్ గ్రీన్ కలర్ లో చాలా వాహనాలు ఇప్పటికీ కూడా మార్కెట్ లో ఉన్నాయి. ఒక్క వాహనాల విషయంలోనే కాకుండా ఇంకా చాలా వాటికి ఆలివ్ గ్రీన్ రంగులు ఉన్నాయి. కాగా వాటన్నిటికీ లేని నిషేదం కేవలం జనసేన ప్రచార రథానికే ఎందుకు వర్తిస్తోంది అంటూ జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కూడా పవన్ పై వైసీపీ చేస్తోన్న కుట్రేనని జనసేన వర్గం నుంచి వినిపిస్తున్న మాట. మొత్తానికి పవన్ ప్రచార రథం ” వారాహి ” రావడంతోనే పోలిటికల్ హీట్ పొంచుతోంది.