Monday, April 29, 2024
- Advertisement -

వామ్మో.. మోడీ టూర్లకు అన్నీ కోట్లా ?

- Advertisement -

సాధారణంగా ఒక రాజకీయ నాయకుడి జీవన విధానం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆడంబరత, నిరాడంబరత వంటివి రాజకీయ నాయకుడి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయడంతో పాటు, ప్రజాభిప్రాయాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. గతంలో మన దేశ ప్రధానులుగా పని చేసిన పీవీ నరసింహారావు, లాల్ బహదూర్ శాస్త్రి, ఐ కే గుజ్రాల్, అటల్ బిహారీ వాజ్ పేయ్ వంటి వారు ఎంతో నిరాడంబరత ను ప్రదర్శిస్తూ దేశ ప్రజల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. కానీ ప్రస్తుతం మన దేశ ప్రధాని ఆడంబరతకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, హంగు ఆర్భాటలతో ప్రజా ధనాన్ని వృదా చేయడంలో ముందు వరుసలో ఉన్నారు. .

మోడీ దేశ పరిపాలనాపై ఎంత మేర దృష్టి కేంద్రీకరిస్తారో.. అంతకు రెండంతలు పబ్లిసిటీపై ఫోకస్ చేసుకుంటారనేది మొదటి నుంచి వినిపిస్తున్న మాట. కెమెరా ఫస్ట్.. పరిపాలన నెక్స్ట్ అనే పంథాలో మోడీ వైఖరి ఉంటుందనే విమర్శలను తరచూ వింటూనే ఉంటాం. ఇక మోడీ వస్త్రధారణ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొన్ని లక్షల విలువతో ఆయన వేసుకునే సూట్లు ఉంటాయి. ఇక ఆయన విదేశాల ప్రయాణానికి కూడా కొన్ని కోట్లు ఖర్చు కాక తప్పదు. ఒక విధంగా చెప్పాలంటే మన ప్రధాని మన దేశంలో కన్నా ఇతర దేశాలలోని ఎక్కువ గడిపేస్తూ ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక తాజాగా మోడీ ఫారెన్ టూర్లకు అయిన ఖర్చును కేంద్రం అభికారికంగా బయట పెట్టింది. గత ఐదేళ్ల కాలంలో మోడీ 36 దేశాలు తిరిగారాని, అందుకుగాను మొత్తం రూ.239 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు కేంద్ర మంత్రి మొరళీధరన్ లిఖిత పూర్వకంగా తేలిపారు. 2017 లో మొదట ఫిలిప్పీయన్ లో పర్యటించిన మోడీ.. 2021 వరకు బంగ్లాదేశ్, అమెరికా, బ్రిటన్, ఇటలీ, రష్యా పర్యటనలు చేశారని తెలిపారు గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా అమెరికా పర్యటన చేయగా అందుకోసం రూ.23 కోట్లు, ఈ ఏడాది జపాన్ పర్యటనకు గాను రూ.23 లక్షలు ఖర్చు అయినట్లు కేంద్రం ఎల్లడించిన లెక్కలు చెబుతున్నాయి. అయితే అధికారికంగానే మోడీ పర్యటనలకు రూ.239 కోట్లు ఖర్చు అయితే అనధికారికంగా ఇంకెన్ని కోట్లు ఖర్చు అయ్యి ఉంటాయో అన్న ప్రశ్నలు వ్యక్తమౌతున్నాయి. దీన్ని బట్టి మన ప్రధాని మోడీ ఆడంబరతకు ఎంత ప్రదాన్యం ఇస్తారో అర్థం చేసుకోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -