Friday, May 9, 2025
- Advertisement -

బాబు కోసం పవన్ సినీ ఫీట్లు..సెటైర్లు!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. తమ అధినేత అరెస్ట్‌ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక టీడీపీ శ్రేణుల కంటే ఎక్కువగా బాధపడిపోతున్నారు జనసేన అధినేత పవన్. బాబు అవినీతి ఆరోపణలో ఒక్కమాట కూడా మాట్లాడని పవన్…ఆయన్ని అరెస్ట్ చేయగానే స్పందించడానికి అస్సలు ఆలస్యం చేయలేదు.

చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీకి ఏదో ఉపద్రవం పొంచుకొచ్చినట్లు ఉగిపోయారు. హుటాహుటినా మీడియాకు ఓ వీడియోని రిలీజ్ చేసి తీవ్రంగా ఖండించారు. ఇది అక్రమమని…దీనిని పూర్తిగా ఖండిస్తున్నానని చెప్పుకొచ్చారు. అంతేగాదు ప్రత్యేక విమానంలో బేగంపేట నుండి అమరావతికి వచ్చేందుకు రెడీ కూడా అయ్యారు. అయితే బేగంపేటలో పోలీసులు పవన్‌ని అడ్డుకున్నారు.

దీంతో రోడ్డు మార్గంలో విజయవాడకు బయలు దేరారు. అక్కడ కూడా పవన్‌కి చుక్కెదురైంది. దీంతో చంద్రబాబు దత్త పుత్రుడు.. పవన్‌ రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. ఇక చంద్రబాబు కోసం పవన్ పడుతున్న ఫీట్లు చూసి సినిమా తలపిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. టీడీపీ నేతలు కూడా ఇంతలా బాబు కోసం తాపత్రయం పడుతున్నారో లేదో తెలియదు కానీ పవన్ పడుతున్న బాధలు చూసి నవ్వు ఆపుకోలేక పోతున్నారు. అవినీతి బాబుని అరెస్ట్ చేస్తే నీకు ఇదేమి కర్మ బ్రో అంటూ మరికొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -