తెరపైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఆయన కాళ్ళు, చెప్పులు కనిపించినా కూడా ఆయన అభిమానులు విజిల్స్ మోత మోగిస్తారు. అయితే నిజ జీవితంలో ముందు వైఎస్ జగన్ ముందు తేలిపోయాడు పవన్. తెరపైన మాత్రమే హీరో……రియల్ లైఫ్‌లో మాత్రం అంత సీన్ లేదని తనకు తానే నిరూపించుకున్నాడు పవన్. రీసెంట్‌గా కాలి నడకన తిరుమల కొండ ఎక్కినప్పుడు కూడా పవన్ శారీరక సామర్థ్యం ఏంటో తెలిసిపోయింది. ఇప్పుడు పోరాటయాత్ర సందర్భంగా కూడా పాలిటిక్స్‌లో పవన్ హీరోయిజం ఏ పాటిదో అందరికీ అర్థమైపోయింది.
పాదయాత్ర సందర్భంగా అత్యంత ఖరీదైన షూ…….అలాగే కేవలం సాయంత్రం, ఉదయం వేళల్లో మాత్రమే నడిచి మమ అనిపించాడు చంద్రబాబు. కానీ జగన్ మాత్రం దాదాపుగా 280 రోజులుగా అలుపు లేకుండా మండే వేసవిలో పాదయాత్ర చేస్తున్నాడు. అనుక్షణం ప్రజలతో మమేకం కావడానికే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే సందర్భంలోనే పోరాటయాత్ర అంటూ ప్రజల ముందుకు వచ్చిన పవన్ మాత్రం రెండు మూడు రోజులకే అలసిపోయాడు. గత రెండు రోజులుగా పూర్తిగా గెస్ట్ హౌస్‌కే పరిమితమయ్యాడు పవన్. సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పి జనసేన వర్గాలు సాకులు చెప్తున్నప్పటికీ శారీరకంగా పవన్ ఎండలను తట్టుకోలేకపోయాడని, అందుకే జాగ్రత్తలు తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటున్నాడని పవన్ ఉన్న గెస్ట్ హౌస్ మేనేజ్‌మెంట్ చెప్తున్నారు.
పవన్ కూడా కనీసం మీడియా ముందుకు వచ్చి పలకరించే ఓపిక లేనట్టుగా వ్యవహరించడం కూడా పవన్ శారరీరకంగా అలసిపోయాడన్న వార్తలకు బలం చేకూరుస్తుంది. ప్రస్తుతం జగన్ కూడా ఆంధ్రప్రాంతంలోనే పాదయాత్ర చేస్తూ ఉండడం ఇఫ్పుడు పవన్-జగన్‌ల రియల్ లైఫ్ హీరోయిజం గురించి గోదావరి జిల్లా ప్రజలతో ఉత్తరాంధ్ర ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. తెరపైన పవన్ హీరోయిజం ఎలా ఉన్నా……..నిజ జీవితంలో మాత్రం ప్రజల మధ్యన, ప్రజల కోసం ఎండా, వాన లెక్క చేయకుండా పోరాడడంలో మాత్రం జగనే సిసలైన హీరో అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
వేలాది మంది ప్రజలతో అనుక్షణం కలిసిపోతూ………మండు వేసవిలో కాలినడకన వందలాది కిలోమీటర్లు నడవడం అంటే మాటలా? సినిమాలలో యాక్ట్ చేసినంత సులభం అయితే కచ్చితంగా కాదు. అలా చేయాలంటే చాలానే కమిట్మెంట్ ఉండాలి.