రాజకీయాలకు రాజకీయాలు నేర్పే ఉద్ధండుడు తెలంగాణ సిఎం కెసిఆర్. సమకాలీన భాతర రాజకీయాల్లో కెసిఆర్ ను మించిన వ్యూహకర్తలు లేరనే చెప్పాలి. నాడు ఇద్దరు ఎంపిలు కలిగిన ఒక ప్రాంతీయ పార్టీ భారత ప్రభుత్వం మెడలు ఒంచి రాష్ట్రాన్ని సాధించిందంటే అది కేసిఆర్ వ్యూహ చతురత తప్ప మరొకటి కాదు.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను తెలంగాణ సిఎం కెసిఆర్ అందివచ్చిన వరాలుగా మార్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఎ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికల నేపథ్యంలో బిజెపి అధిష్టానానికి వ్యూహాత్మకంగా దగ్గరయ్యారు కెసిఆర్. ఢిల్లీలో చక్రం తిప్పారు. కేంద్ర మంత్రులను కలిసి తాము ఎంతగా భేషరతుగా మద్దతిస్తున్నమో తెలియజెప్పారు. దీంతో బిజెపి నాయకత్వానికి దక్షిణాదిలో ఒక నమ్మకమైన స్నేహితుడు దొరికిండని సంబరపడే స్థితికి వచ్చేలా చేశారు కెసిఆర్.
ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయిడిని చూసుకుంటె కేంద్రందగ్గర తన ప్రారభవాన్ని కోల్పోతున్నారు. ఇంతకాలం ఎన్డీఎ భాగస్వామ్య పక్షంగా ఉన్న దక్షిణాది స్నేహితుడిగా కొనసాగుతున్న ఎపి సిఎం చంద్రబాబును బిజెపి దూరం చేసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఒకదశలో తెలంగాణ సిఎం కు, ప్రతిపక్షనేత జగన్‌కు ప్రధాని అపాయింట్ మెంట్ దొరికింది కానీ ఎన్డీఎ భాగస్వామి అయిన చంద్రబాబుకు అపాయింట్ మెంట్ దొరకలేదంటే అర్థం చేసుకోవాలి.
ఉత్తరాదిలో నమ్మకమైన మిత్రుడుగా నితీష్ దొరికాడు బిజెపికి. ఇటు దక్షిణాదిలో కెసిఆర్ తో పాటు మరో మిత్రుడు కూడా దొరికినట్లయింది. ఎపిలో అవసరమైతే జగన్ తో బిజెపి దోస్తాన్ చేయొచ్చని అంటున్నారు. గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యులు చూసుకుంటె ఎపిలో జగన్, ఇక్కడ మేము అన్న కెసిఆర్ మాట 2019లో అమలవుతుందేమో అన్న వాతావరణం రాజకీయాల్లో ఉంది.
- Advertisement -
కేసీఆర్, జగన్‌కు దొరికిన మోదీ అపాయంట్‌మెంట్.. కాని బాబుకు దక్కలేదు.
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -