రాష్ట్ర అభివృద్దిపై చంద్రబాబు కొట్టుకుంటున్న సొంత డబ్బా ఉత్తదనే తేలిపోయింది. ఏకంగా ప్రధాని మోదీనే బాబు బండారాన్ని బట్టబయలు చేశారు. కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, విజయనగరం, విశాఖ బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో మోదీ వీడియే కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మోదీ కార్యకర్తలకు సూచించారు.
టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని సాధనాలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుం దని ఆరోపించారు. రాష్ట్ర అభివద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరించినా అసత్యప్రాచారాలు చేస్తోందన్నారు. రూ. 20 వేల కోట్ల వరకు రిసోర్స్ గ్యాప్, రెవెన్యూ డెఫిసిట్ ఫండ్‌గా విడుదల చేశామన్నారు. ఏపీ ప్రభుత్వం మాత్రం అందలేదని చెబుతోందని, ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్ళిందని మోదీ ప్రశ్నించారు.
ఇప్పటి వరకు నీతి ఆయోగ్ కోరితేనే తాము పోలవరం నిర్మాణబాధ్యతలు చేపట్టామని ఒకవైపు ముఖ్యమంత్రి చెబుతుంటే..ప్రధాదీనికి భిన్నంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే పోలవరం ప్రాజెక్టులను అప్పగించామని మోదీ వెల్లడించారు. పోలవరానికి వందశాతం కేంద్రం డబ్బులు ఇస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు పోలవరానికి రూ. 7 వేల కోట్లు ఇచ్చామని, ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం అడిగిందని మోదీ పేర్కొన్నారు.
విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాధాన్యమున్న 10 విద్యాసంస్థలను ఏపీలో ప్రారంభించామని.. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చినన్ని సంస్థలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికీ దక్కలేదని ప్రధాని మోదీ అన్నారు. ఏపీ కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటామని.. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, విజన్‌ను ఏపీ ప్రజలకు వివరించాలని మోదీ కార్యకర్తలకు సూచించారు.
వెనుక బడిన జిల్లాలకు వెయ్యి కోట్లు ఇచ్చామని..అయితే, ఏపి ప్రభుత్వం ఇప్పటి వరకు యుటిలైజేషన్ పత్రాలు ఎందుకు ఇవ్వటం లేదని ప్రధాని ప్రశ్నించారు.