పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఏర్పాట్లు పూర్తైనట్లు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. 539 పంచాయతీలు, 12వేల 604 వార్డులు ఏకగ్రీవమైనట్లు ద్వివేది వెల్లడించారు. రెండో దశ ఎన్నికలకు 29,304 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
5,480 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 4,181 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామన్నారు. ఎన్నికల నిర్వహణకు 47,492 మంది సిబ్బందిని నియమించామన్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ సామగ్రి ఏర్పాటు చేశామన్న ద్వివేది… మాస్క్‌లు, శానిటైజర్‌లు, థర్మల్ స్కానర్లు, గ్లౌజులు అందుబాటులో ఉంచామన్నారు.
కొవిడ్ బాధితులకు పీపీఈ కిట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత… పోలింగ్ సరళిని ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు కమాండ్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితుల పరిశీలనకు వెబ్ క్యాస్టింగ్ నిర్వహిస్తున్నామన్న ఆయన… ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు.
షర్మిల నిర్ణయం… బాబు నోటి నుంచి ఆ మాట..!
తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా!
షర్మిల పార్టీ ప్రకటనపై స్పందించిన హరీష్ రావు