Monday, April 29, 2024
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా!

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఆంద్రప్రదేశ్ లో 2 ఉపాధ్యాయ, తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో ఖాళీ కానున్న సంగతి తెలిసిందే. ఈ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ ప్రకటించింది. ఈనెల 16న నోటిఫికేషన్‌ వెలువడుతుందని పేర్కొంది. అదే రోజు నుండి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ.

ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహారణకు చివరి తేదీ ఫిబ్రవరి 26. మార్చి 14వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు ఓటింగ్ జరుగుతుంది. మార్చి 17 న ఓట్ల లెక్కింపు. మార్చి 22వ తేదీలోపుగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఈసీ ఆదేశించింది.

ఎన్నికలు జరిగే స్థానాలు ఇవే..
ఏపీలో తూర్పు గోదావరి-పశ్చిమగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా స్థానాల్లో ఎమ్మెల్సీలుగా ఉన్న రాము సూర్యారావు, ఎ.ఎస్. రామకృష్ణ ఈ ఏడాది మార్చి 29న రిటైర్ కానున్నారు. తెలంగాణలో మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైద్రాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి రామచంద్రరావు, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి మార్చి 29న రిటైర్ కానున్నారు.

Also Read

ఒక్క ఛాన్స్ చివరి ఛాన్స్ అనేటట్లుగా తీర్పు ఇచ్చారు..!

ఉద‌య‌భాను సినీ ఇండస్ట్రీలోకి రాకపోవడానికి కారణం ఏంటి ?

బ్రౌన్ రైస్ తో ఎంతో మంచి ఆరోగ్యం!

విజయ్ దేవరకొండ ‘లైగర్’ డేట్ ఫిక్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -