Monday, May 12, 2025
- Advertisement -

వైఎస్సార్‌ది జలయజ్ఙం…. ప్రస్తుతం జరుగుతున్నది ధనయజ్ఙం: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు

- Advertisement -

వైఎస్సార్ జలయజ్ఙం గురించి చంద్రబాబుతో సహా పచ్చ గ్యాంగ్ అందరూ కూడా చేసిన అవినీతి వ్యాఖ్యలు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పుడు అదే వైఎస్సార్ తీసిన కాలవల ద్వారా పట్టిసీమ నీరు పారిస్తున్నారు. ఆ వైఎస్సార్ 70-80శాతం నిర్మించిన ప్రాజెక్టులను పూర్తిచేస్తూ అంతా తమ ఘనతే అని చెప్పుకుంటున్నారు. అఫ్కోర్స్…….ఈ ప్రాజెక్టులను ప్రారంభంచే అదృష్టం తనకు దక్కడం మహాభాగ్యంగా భావిస్తున్నానని చంద్రబాబు చెప్తున్నమాటల్లోనే వైఎస్సార్ నిర్మించిన ప్రాజెక్టులను నేను ప్రారంభిస్తున్నానన్న అర్థం కూడా ధ్వనిస్తూ ఉంటుందనుకోండి.

ఆ విషయం పక్కన పెడితే అప్పట్లో వైఎస్సార్‌ది ధన యజ్ఙం, అవినీతి వ్యవహారం అంటూ విరుచుకుపడిన చంద్రబాబుకు ఇప్పుడు ఆయన భాగస్వామ్య పార్టీ బిజెపి నుంచే షాక్ తగిలే స్థాయి కౌంటర్స్ పడ్డాయి. అది కూడా తాను ఢిల్లీలో మోడీతో భేటీ అయిన సందర్భంలోనే ఇక్కడ తెలుగు నాట వైఎస్సార్‌ది జలయజ్ఙం…… ప్రస్తుతం జరుగుతున్నది ధన యజ్ఙం అన్న మాటలు సాక్షాత్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి నోటి నుంచే వెలువడ్డాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, గతంలో బిజెపి పార్టీలో జాతీయ స్థాయిలో ఎన్నో పదవులు చేపట్టిన సీనియర్ నేత డా. లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులకు సాగునీరు కోసం వైఎస్సార్ జలయజ్ఙం చేపట్టి ప్రాజెక్టులు చేపట్టాడని కొనియాడారు. కానీ ప్రస్తుతం మాత్రం పూర్తిగా ధన యజ్ఙం జరుగుతోందని చెప్పుకొచ్చాడు.

వైఎస్‌లు అంటేనే రాక్షసులు, అవినీతిపరులు……. అసలు మనుషులే కాదు అని జనాలను నమ్మించడానికి విష ప్రచారంతో విపరీతంగా ప్రయత్నిస్తూ ఉండే బాబు అండ్ బ్యాచ్‌కి తమ భాగస్వామ్య పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మాటలు కచ్చితంగా షాక్ కొట్టి ఉంటాయనడంలో సందేహం లేదు. టిడిపి వాళ్ళు ఎంత విషప్రచారం చేసినప్పటికీ ఉచిత విద్యుత్, జలయజ్ఙం, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలతో గ్రామీణ ప్రాంతాలకు వైఎస్సార్ చేసిన సేవలు మాత్రం ఎప్పటికీ మరుగునపడిపోవని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -