పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఎట్టకేలకు పచ్చకండువా కప్పుకున్నారు. పైకి ఎలాంటి వార్తలు వచ్చినా తెరవెనుక మాత్రం బలమైన కారనాలు ఇప్పుడు బయటకు బస్తున్నాయి. వైసీపీలోని కొందరి నేతల శైలి, అసందర్భ వ్యాఖ్యలు పార్టీకి పెనశాపంలా మారాయినె వార్తలు వినిపిస్తున్నాయి. గిడ్డి ఈశ్వరి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దుస్థితిలో పార్టీ పెద్దలున్నారు. తన గురించి చేసిన వ్యాఖ్యలున్న వాయిస్ రికార్డులు కూడా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వద్ద ఉండడం తీవ్ర దుమారం రేపుతోంది.
ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఎవరిని ఎక్కడి నుంచి పోటీలోకి దించితే బాగుంటుందన్న అంశాలపై పార్టీలోని పెద్దలు చర్చించడం ఏపార్టీలోనైనా సహజమే. పాడేరు ఎమ్మెల్యేగా గౌరవనీయ స్థానంలో ఉన్న ఆమెను రాజ్యసభ ఎన్నికల అనంతరం పక్కన పెట్టేయడమేనని, ఆమె సీటును వచ్చే ఎన్నికల్లో వేరొకరికి ఇవ్వనున్నట్లు సాక్షాత్తూ విజయసాయిరెడ్డే చెప్పినట్లు అరకులోని కొందరికి నగరంలోని ఇద్దరు నేతలు వివరించారు. దీంతోపాటు ఆ ఇద్దరు నేతలు కొద్దిరోజుల కిందట అరకు వెళ్లినప్పుడు కూడా కుంభా రవిబాబుకు అరకు టిక్కెట్‌ను ఇవ్వబోతున్నట్లు కూడా పేర్కొన్నారు.
గిడ్డి ఈశ్వరికి సంబంధించి ఫోన్లలో మాట్లాడుకున్న వ్యాఖ్యలను రికార్డు చేసిన వ్యక్తులు వేరొకరికి పంపడం… ఆయా వాయిస్ రికార్డులు చివరకు గిడ్డి ఈశ్వరికి చేరడంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఎందరో పార్టీని వదిలి వెళ్లిపోతున్నా తాను మాత్రం వైకాపాను నమ్ముకుని ఉంటే తనను మార్చి వేరొకరికి సీటు ఇవ్వాలని నిర్ణయించడాన్ని ఆమె తట్టుకోలేకపోయారు. దాంతోనె పార్టీ మారారనె వార్తలు వినిపిస్తున్నాయి.
శనివారం రాత్రి పది గంటల తరువాత ఆమె విజయసాయిరెడ్డిని కలిసి, వైకాపాలోని కొందరు నేతలు ఆమెపై చేసిన వ్యాఖ్యలున్న వాయిస్ రికార్డులను ఆయనకు వినిపించినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఆయా వాయిస్ రికార్డులను విన్న ఆయన నిర్ఘాంతపోయినట్లు తెలుస్తోంది. ముందూ వెనకా ఆలోచించకుండా మాట్లాడిన ఆ ఇద్దరు నేతలు మధ్యలో విజయసాయిరెడ్డి పేరును కూడా ఇరికించడంతో ఆయనకు ఏవిధంగా స్పందించాలో కూడా అర్థంకాని పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.
విజయవాడకు వెల్లి చంద్రబాబును కలుస్తుందన్న వార్తల నేపథ్యంలో చివరిసారిగా వైకాపా తరపున కరణం ధర్మశ్రీ, కొయ్య ప్రసాదరెడ్డిలు ఆదివారం పాడేరు వెళ్లి ఆమెను కలిసి మాట్లాడారు. పార్టీలో తనకు అవమానం జరిగిందని, తాను పార్టీలో కొనసాగే పరిస్థితి లేదని ఆమె వారికి తేల్చిచెప్పారు. తరువాత విజయసాయిరెడ్డి ఫోన్లో మాట్లాడినా కూడా ఫలితం లేకుండా పోయింది.