Thursday, March 28, 2024
- Advertisement -

సిద్దిపేట ఉప ఎన్నిక ఖాయం! బ‌రిలోకి ఎవ‌రో తెలుసా?

- Advertisement -

గ‌త కొన్ని రోజులుగా గుస‌గుస‌లాడుకుంటున్న‌దే.. అంద‌రూ చెవులు కొరుక్కుంటున్న‌దే.. అదేనండి టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ త‌న కొడుకు కేటీఆర్‌కు లైన్ క్లియ‌ర్ చేయ‌డానికి హ‌రీష్‌రావును ప‌క్క‌న పెడుతున్నార‌ని. ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే ఇవ‌న్ని తొంద‌ర‌లోనే ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చేలా ఉన్నాయి. దీనికి త‌గ్గ‌ట్టుగానే హ‌రీష్‌రావు చ‌ర్య‌లు క‌నిపిస్తున్నాయి. మంత్రి బంగ్లా ఖాళీ చేయ‌డం.. ట్రేడ్ యూనియన్‌ల గౌర‌వ అధ్య‌క్ష ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌డం.. ఇవ‌న్ని చూస్తుంటే ఎక్క‌డో తేడా కొడుతుంద‌ని అందరు అనుకుంటున్నారు. కానీ ఎవ్వ‌రికి మాట్లాడేంత ధైర్యం లేద‌నుకోండి.

తెలంగాణ వాయిస్‌ను దేశ‌వ్యాప్తంగా వినిపించాలంటే అది హ‌రీష్‌రావు వ‌ల్ల‌నే అవుతోంద‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. దీని కోసం హ‌రీష్‌రావ‌ను మెద‌క్ పార్ల‌మెంట్ స‌భ్యుడిగా పోటీ చేయాల‌ని కేసీఆర్ స‌మాలోచ‌న‌లు చేస్తున్నార‌ట‌. మ‌రి సిద్ధిపేట ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఎవ‌రైతే బాగుంటుంద‌ని ఆలోచించ‌గా.. హ‌రీష్‌రావు భార్య శ్రీ‌నిత అయితే బాగుంటుంద‌ని అనుకుంటున్నార‌ట‌. దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయ‌ని స‌మాచారం. హ‌రీష్ వెంట‌నే రాజీనామా చేసి లోక్ స‌భ ఎన్నిక‌పై దృష్టి పెట్టాల‌ని సూచించ‌నున్నార‌ని స‌మాచారం. మ‌రి దీనిపై హ‌రీష్ ఎలా రియాక్ట‌ర‌వుతారో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -