టీఆర్ఎస్ పార్టీ బాధ్యతలను తన తనయుడు కేటీఆర్‌కు అప్పగించారు సీఎం కేసీఆర్.టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎమ్మెల్యే కే.టీ రామారావు ఈ రోజు(సోమవారం) బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ భవన్‌లో ఈరోజు (సోమవారం) ఉదయం 11:56 నిమిషాలకు ఆయన బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ భవన్ వరకు భారీ ర్యాలీగా చేరుకున్న కేటీఆర్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. దాదాపు 20వేలకు పైగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు తెలంగాణ భవన్ వద్దకు తరలివచ్చారు.
కార్యక్రమానికి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున హాజరైయ్యారు.కాని తన బావ మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని తెలుస్తుంది.హైదరబాద్‌లో ఉన్నప్పటికి హారీష్ రావు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాద్యతల స్వీకరణ కార్యక్రమానికి రాలేదని సమాచారం.అయితే హారీష్ రావు ఎందుకు రాలేదో కారణం తెలియాల్సి ఉంది.కేటీఆర్‌కు పార్టీ బాద్యతలను అప్పగించడం పట్ల హారీష్ రావు కోపంగా ఉన్నారని సమాచారం.
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు